కొలంబోకు విమాన సర్వీసులు పునఃప్రారంభం

4 Sep, 2021 04:00 IST|Sakshi

శంషాబాద్‌: హైదరాబాద్‌ నుంచి శ్రీలంకలోని కొలంబోకు నేరుగా వెళ్లే విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. 19 నెలల తర్వాత శుక్రవారం ఉదయం 9.55 గంటలకు 120 మంది ప్రయాణికులతో శ్రీలంక ఎయిర్‌లైన్స్‌ విమానం ఇక్కడి నుంచి కొలంబోకు బయలుదేరింది. వారానికి రెండుసార్లు (సోమ, శుక్రవారం) ఈ విమాన సర్వీసులు ఉంటాయని గెయిల్‌ సీఈఓ ప్రదీప్‌ ఫణీకర్‌ మీడియాకు వెల్లడించారు. అంతకుముందు కొలంబో నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న శ్రీలంక ఎయిర్‌లైన్స్‌ విమానానికి జీఎంఆర్‌ ప్రతినిధులు ప్రత్యేకంగా స్వాగతం పలికారు.   

మరిన్ని వార్తలు