Gotabaya Rajapaksa: థాయ్‌లాండ్‌ చెక్కేసిన శ్రీలంక మాజీ అధ్యక్షుడు

10 Aug, 2022 15:11 IST|Sakshi

కొలంబో: శ్రీలంక సంక్షోభానికి మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్సే కారణమంటూ నిరసనకారలు ఆందోళనలు చేపట్టడంతో గోటబయ దేశం విడిచి  పారిపోయిన సంగతి తెలిసింది. ఈ మేరకు ఆయన మాల్దీవుల నుంచి సింగపూర్‌కి పయనమయ్యారు. అక్కడే 14 రోజుల పర్యాటక వీసాపై తాత్కాలికంగా ఆశ్రయం పొందారు కూడా. అంతేగాక ఆ వీసా గడువు ఆగస్టు 11తో ముగియునున్న తరుణంలో శ్రీలంక ప్రభుత్వం మరికొన్ని రోజులు గోటబయకి అక్కడే ఆశ్రయం ఇవ్వాల్సిందిగా సింగపూర్‌ అధికారులను కోరింది.

మరీ ఏమైందో తెలియదు గానీ ఆయన హఠాత్తుగా థాయలాండ్‌ చెక్కేస్తున్నట్లు అధికారిక  వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు గోటబయ రాజపక్స గురువారానికి థాయ్‌లాండ్‌ చేరుకునే అవకాశం ఉందని వెల్లడించింది కూడా. దీంతో గోటబయ థాయలాండ్‌లో ఆశ్రయం పొందుతున్నట్లు తెలుస్తోంది. ఏదీఏమైన తీవ్ర నిరసనలు నడుమ అధ్యక్ష పదవికి రాజీనామ చేసి దేశం వదిలి పారిపోయిన తొలి అధ్యక్షుడగా గోటబయ నిలిచిపోయాడు. 

(చదవండి: Gotabaya Rajapaksa: ప్లీజ్‌ ఆయన్ని అక్కడే ఉండనివ్వండి... అభ్యర్థించిన శ్రీలంక)

మరిన్ని వార్తలు