Sri Lanka Crisis: కోపం వస్తే ఇలా ఉంటది.. అధ్యక్షుడి ఇంట లంకేయుల రచ్చ

9 Jul, 2022 16:38 IST|Sakshi

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ఇంకా ఆర్థిక సంక్షోభం కొనసాగుతూనే ఉంది. కొద్దిరోజుల క్రితం లంక ప్రధానమంత్రి మారినా పరిస్థితులు మాత్రం ఏమాత్రం చక్కబడలేదు. సరిపడా ఇంధన నిల్వలు లేకపోవడంతో వాహనాలు నడుపలేక పాఠశాలలకు సైతం సెలవులు ప్రకటించారు. దీంతో, ప్రభుత్వ తీరుపై లంకేయులు మళ్లీ ఆందోళనలకు దిగారు. 

ఇదిలా ఉండగా.. లంకలో శనివారం ఊహించిన పరిణామం చోటుచేసుకుంది. ప్రజల ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. లంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్ష రాజీనామా చేయాలంటూ ఆందోళన చేస్తున్న ప్రతిపక్షాలు, ప్రజలు ఆయన నివాసాన్ని ముట్టడించారు. ఈ క్రమంలో గొటబాయ.. ఆయన నివాసం నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ దేశ రక్షణ శాఖ వర్గాలు వెల్లడించినట్లు స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి.

అధ్యక్షుడి ఇంటి వద్ద ఆందోళనలకు దిగిన లంకేయులు.. బారికేడ్లను తొలగించి అధ్యక్షుడి కార్యాలయంలోకి ప్రవేశించారు. వందల సంఖ్యలో నిరసనకారులు అక్కడ ఉన్న స్విమ్మింగ్‌ పూల్‌లో దిగి రచ్చ రచ్చ చేశారు. వంట గదిలో దూరి బీభత్సం సృష్టించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో, పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు లంక ప్రధాని రణిల్ విక్రమసింఘే పార్టీ నేతలను అత్యవసర సమావేశానికి పిలిచారు.గతంలో కూడా అప్పటి ప్రధాని మహింద రాజపక్స ఇంటిని ఆందోళనకారులు ముట్టడించటం వల్ల ఆయన కూడా ఇలాగే పారిపోయారు.

అయితే, లంకేయుల నిరసనలు తెలుపుతున్న రుణంలో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్‌ గ్యాస్‌, వాటర్‌ ఫిరంగులను ఉపయోగించారు. ఈ క్రమంలో ఇద్దరు పోలీసులతో సహా 30 మంది గాయపడ్డారని తెలుస్తోంది. వీరందరూ కొలంబోలోని జాతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సమాచారం. 

ఇది కూడా చదవండి: మంచి పని చేసినా.. విమర్శలు ఎదుర్కొంటున్న రిషి సునాక్‌ భార్య అక్షతా మూర్తి

మరిన్ని వార్తలు