చైనాతో దోస్తీ వల్లే ఇలా జరిగింది.. ప్రధానిపై సంచలన ఆరోపణలు

6 Apr, 2022 08:44 IST|Sakshi

కొలంబో: ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంకలో దారుణ పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. తినేందుకు తిండి లేక లంకేయులు పస్తులు ఉండాల్సి వస్తోంది. ద్రవ్యోల్బణం కారణంగా నిత్యవసర వస్తువుల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో రాజపక్సే ప్రభుత్వంపై ఆ దేశ ప్రజలు తిరుగుబాటుకు దిగారు. లంకేయుల ఆందోళనల నేపథ్యంలో శ్రీలంకలో ఎమర్జెన్సీ, కర్ఫ్యూ సైతం విధించిన విషయం తెలిసిందే. 

ఇదిలా ఉండగా.. తాజాగా లంక ప్రభుత్వంపై ఆ దేశ వ్యాపారులు సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీలంక ప్రభుత్వం.. చైనాకు అన్నింటినీ అమ్ముతోందని ఆరోపించారు. ప్రతీ దానిని చైనాకు అమ్ముతున్న కారణంగానే శ్రీలంక వద్ద డబ్బు లేదు. ఇది ఇతర దేశాల నుంచి కొనుగోలు చేసే వాటిపై ప్రభావం చూపుతోందన్నారు. ప్రతీ వస్తువు వేరే దేశాల నుంచి కొనడం కష్టంగా మారింది. ఇదే ప్రధాన సమస్య అని పేర్కొన్నారు. రోజురోజుకు ధరలు పెరుగుతున్నాయని, తమ వద్ద నగదు కూడా మిగలడం లేదని అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా పండ్ల విక్రయదారుడు ఫరూఖ్ మాట్లాడుతూ.. నాలుగు నెలల క్రితం కిలో ఆపిల్స్‌ రూ. 500 గా ఉంది. ఇప్పడు ఆపిల్స్‌ ధర రూ. 1000-1500లకు చేరుకుంది. ప్రజల వద్ద డబ్బు లేకపోవడంతో ఎవరూ కొనుగోలు చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు.. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రతిపక్ష నాయకుడు సజిత్ ప్రేమదాస కార్యనిర్వాహక అధ్యక్ష వ్యవస్థను రద్దు చేయాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు అధికార పార్టీకి చెందిన, కొత్తగా నియమితులైన ఆర్థిక మంత్రి అలీ సబ్రీ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు.

ప్రభుత్వంపై నిరసనల్లో భాగంగా ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఆందోళనకారులు బారికేడ్లు ధ్వంసం చేసి నిరసనలు కొనసాగించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఇది చదవండి: శ్రీలంకలో ముదురుతున్న సంక్షోభం.. మైనార్టీలో గొటబాయ సర్కార్‌

మరిన్ని వార్తలు