వారందరికీ స్వేచ్ఛ ప్రసాదించిన అధ్యక్షుడు

25 Dec, 2023 13:29 IST|Sakshi

కొలంబో: క్రిస్‌మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీలంక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పలు నేరాల్లో జరిమానాలు కట్టకుండా జైలు పాలైన వెయ్యికిపైగా మంది ఖైదీలకు క్రిస్‌మస్‌ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింగే క్షమాభిక్ష ప్రసాదించారు. క్షమాభిక్షపొందిన 1004 మంది ఖైదీలను విడుదల చేసినట్లు అధికారులు సోమవారం తెలిపారు. 

గత వారం దేశంలో డ్రగ్స్‌పై నిరోధానికి చేపట్టిన యాంటీ నార్కొటిక్‌ డ్రైవ్‌లో పోలీసులు ఏకంగా 15 వేల మందిని అరెస్టు చేశారు. వీరిలో 1100 మందిని నిర్బంధ మిలిటరీ పునరావాస కేంద్రంలో ఉంచారు. మిగతా వారిని జైళ్లలో ఉంచారు. దీంతో దేశంలో జైళ్లన్నీ నిండిపోయాయి. ఈ నేపథ్యంలో క్రిస్‌మస్‌ను పురస్కరించుకుని 1000 మందిని జైళ్ల నుంచి విడుదల చేయడం చర్చనీయాంశమవుతోంది.

గడిచిన శుక్రవారం వరకు దేశంలోని జైళ్లలో 30 వేల మంది ఖైదీలు ఉన్నారు. అయితే  దేశంలో ఉన్న జైళ్ల మొత్తం కెపాసిటీ కేవలం 11 వేలేనని జైళ్ల శాఖ అధికారిక గణాంకాలు చెబుతుండడం గమనార్హం. బౌద్ధ మతస్తులు మెజారిటీలుగా ఉండే శ్రీలంకంలో గతంలో బుద్ధ జయంతి రోజు కూడా భారీ సంఖ్యలో ఖైదీలను విడుదల చేశారు.

ఇదీచదవండి..హిజాబ్‌ వివాదం: కర్ణాటక హోం మంత్రి కీలక వ్యాఖ్యలు

>
మరిన్ని వార్తలు