StayStrongIndia: నయాగారా జలపాతం త్రివర్ణశోభితం

1 May, 2021 17:08 IST|Sakshi

కరోనా ధాటికి గజగజ వణుకుతున్న భారతదేశానికి ప్రపంచ దేశాలు అండగా నిలుస్తున్నాయి. ప్రపంచంలోని పలు దేశాలు తమకు తోచిన విధంగా సహాయ కార్యక్రమాలు చేస్తున్నాయి. సహాయం చేస్తూనే మరో పక్క భారత్‌ ధైర్యం ఉండు.. కోలుకో అంటూ సందేశాలు పంపిస్తున్నాయి. ఇటీవల బూర్జ్‌ ఖలీఫాపై భారత జెండా రెపరెపలు ఆడించి ‘భారత్‌ కోలుకో’ అంటూ సందేశం ఇచ్చారు. ఇప్పుడు తాజాగా ప్రపంచంలోనే అతి పెద్ద జలపాతం... పాలనురుగులు కక్కుతూ అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే నయాగార రంగు మారింది.

కెనడాలోని ఒంటరియో వద్ద ఉన్న నయాగార జలపాతం భారత జెండా రంగులు అద్దుకుంది. తెల్లగా కనిపించే నయాగారా కాస్త త్రివర్ణ శోభితంగా మారింది. కరోనాతో తీవ్రంగా సతమతమవుతున్న భారత్‌కు ధైర్యం చెప్పేలా ఈ విధంగా కెనడా అధికారులు ఈ విధంగా నయాగారాపై భారత రంగులు వచ్చేలా లైటింగ్‌ వేశారు. కరోనాతో పోరాడుతున్న భారత్‌కు సంఘీభావం తెలిపేందుకు ఏప్రిల్‌ 28వ తేదీ రాత్రి 9.30 నుంచి 10 గంటల వరకు భారత జెండాలోని మూడు రంగులు ఆకుపచ్చ, తెలుపు, ఎరుపు రంగులు వచ్చేలా లైటింగ్‌ వేశారు. దీంతో నయాగారా త్రివర్ణ శోభితంతో అద్భుతంగా కనిపించింది. ‘ధృడంగా ఉండు భారత్‌ (స్టేస్ట్రాంగ్‌ ఇండియా)’ అంటూ సందేశం పంపారు. 

చదవండి: ఆక్సిజన్‌ అందక కర్నూలులో ఐదుగురు మృతి

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు