Stegosaurus: గుడ్డు నుంచి ఆకాశానికి..

7 Oct, 2021 08:32 IST|Sakshi

అవతార్‌ సినిమా చూశారా.. అందులో హీరో, హీరోయిన్‌ భారీ సరీసృపాల మీద స్వారీ చేస్తూ గాల్లో తేలిపోతుంటారు. ఆ వింత ఆకారం జేమ్స్‌ కామెరాన్‌ అద్భుతసృష్టి. కానీ నిజంగా అలాంటి జీవులు ఉండేవని తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటిపై మనుషులు ఎగిరారో.. లేదో.. తెలియదు కానీ అంత భారీ సరీసృపాలు జీవించింది మాత్రం వాస్తవం. 10 మీటర్లకు పైగా రెక్కలతో ఆకాశాన్ని శాసించిన ఆ సరీసృపం పేరు.. స్టెరోసార్స్‌. యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాలో పాలియోంటాలజీకి చెందిన కెవిన్‌ పాడియన్‌తో పాటు మరికొందరు శాస్త్రవేత్తలు కొన్ని భారీ శిలాజాలపై శాస్త్రీయ అధ్యయనం చేయగా ఆసక్తికర విషయాలు తెలిశాయి.

దాదాపు 228 మిలియన్‌ సంవత్సరాల క్రితం జీవం పోసుకున్న ఈ స్టెరోసార్స్‌.. 66 మిలియన్‌ సంవత్సరాల క్రితం అంతరించిపోయాయి. ఇవి అత్యంత పురాతన ఎరిగే సరీసృపాలు. డైనోసార్లు జీవించిన కాలంలోనే ఇవి మనుగడసాగించాయి. ఇవి గుడ్లను పెట్టి పొదుగుతాయి. స్టెరోసార్స్‌ను ఎగిరే డైనోసార్లు అని అంటారు. అయితే ప్రారంభం దశలో ఇవి ఎలా జీవనం సాగించాయో ఇప్పటికీ చాలా మంది శాస్త్రవేత్తలకు తెలియదట. 

గుడ్డు నుంచి ఆకాశానికి..
ఏ పక్షి అయినా పుట్టగానే ఎగరలేదు.. కొద్ది రోజుల తర్వాత రెక్కలు బలపడి గాలిలోకి ఎగురుతుంది.. ఇదీ మనకు తెలిసిందే. కానీ.. పుట్టిన వెంటనే ఎగిరే పక్షి ఈ స్టెరోసార్స్‌. అలా.. ఇలా.. కాదు.. తల్లితో సమానంగా.. ఒకదశలో తల్లి కంటే సౌకర్యవంతంగా ఆకాశమార్గాన ప్రయాణిస్తుంది.  

గాలితో నిండి ఉండే ఆస్థికలు... 
స్టెరోసార్స్‌ శరీర నిర్మాణమే పుట్టగానే ఎగిరేందుకు సాయం చేస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. పిండాలు, పిల్లలు, పెద్ద జీవుల్లో ఆస్థికలను పోల్చి పరిశోధన చేశారు. దీని ఆస్థికలు బలంగా ఉండి.. గాలితో నిండి ఉంటాయి. పిల్ల సరీసృపాలు పెద్ద వాటి కంటే చురుకుగా ఎరగగలుగుతాయి. రెక్కలు చిన్నగా ఉన్నా.. విస్తృతంగా ఉండటంతో చిన్నవి పెద్ద వాటి కంటే సులభంగా గమ్యాన్ని మార్చుకోగలవు. వేగాన్ని నియంత్రించుకోగలవు. అయితే పెద్దవి ప్రయాణించినంత దూరం ఇవి ఏకదాటిగా వెళ్లలేవు. పిల్ల స్టెరోసార్స్‌కు ఇతర ప్రాణుల నుంచి ముప్పు తప్పేదికాదు. పుట్టగానే ఎగడరం.. ఇతర ప్రాణుల నుంచి రక్షణ పొందడం కోసం వీటికి ఉపయోగపడేదని పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇతర ప్రాణాల నుంచి రక్షణకే కాదు.. దట్టమైన అడవులను దాటడానికి ఈ బలమైన రెక్కలు వినియోగపడేవి. 

ఇక, డైనోసార్ల కాలంలో ఇలాంటి భారీ జీవులు చాలానే ఉన్నాయని గుర్తించారు. మొసళ్లు, ప్లీసియోసార్‌ లాంటి మనుగడసాగించేవి. ఆ కాలాన్ని మెసోజాయిక్‌ శకంగా పేర్కొంటారు. ఆ శకం నాటి 100 కంటే ఎక్కువ జాతుల శిలాజాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆ అవశేషాలను పరిశీలించగా హృదయ విధారక విషయాలు తెలిశాయి. ఆ జీవుల్లో కొన్ని కేవలం తినడానికి తిండిలేక మరణించాయని గుర్తించారు. ప్లీసియోసార్‌కు పొడవాటి మెడ ఉండి.. డజన్ల కొద్దీ ఎముకలు ఉంటాయి. పెంగి్వన్‌కు ఉన్నట్లు ఉండే పొడవైన ఫ్లిప్పర్‌లు ఈదడానికి తోడ్పడతాయి. ప్లీసియోసార్లకు త్రిమింగలం లాంటి మోసాసార్‌ల నుంచి ముప్పు ఉండేది. అవి వీటిని వేటాడి తినేవి. ఈ మోసాసార్‌లను సముద్ర రాక్షసులుగా పిలుస్తారని పరిశోధకులు వివరించారు. స్టెరోసార్స్‌ బతికి ఉంటే.. మనిషి వాటికి కచి్చతంగా ‘అవతార్‌’ చూపించేవాడు. 


మలేయా పక్షి కూడా ఇంతే.. 
గుడ్డు పొదిగి పిల్ల బయటికి వచ్చిన వెంటనే ఎగిరే పక్షులు ఆధునిక శకంలోనూ లేవు. అయితే మలేయా అనే కోడి లాంటి పక్షికి మాత్రం ఇది మినహాయింపు. ఇండోనేషియా ద్వీపాల్లో నివసించే ఈ పక్షి కూడా గుడ్డులోంచి బయటకు రాగానే ఎగరగలుగుతుంది. తమను తాము రక్షించుకోవడం కోసమే వాటి శరీర నిర్మాణం అలా ఉంటుందని పాడియన్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు