వైట్‌హౌస్‌కి కరోనా కాటు..

8 Oct, 2020 03:51 IST|Sakshi

రోజ్‌ గార్డెన్‌ నుంచి ర్యాలీల వరకు మాస్కుల్లేవు, భౌతిక దూరం లేదు

నిర్లక్ష్యమే కొంప ముంచిందంటున్న నిపుణులు

వాషింగ్టన్‌: వైట్‌హౌస్‌ వెన్నులో కరోనా వణుకు పుట్టిస్తోంది. రోజుకి కొన్ని కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కి కరోనా సోకిన తర్వాత కొత్త కేసుల సంఖ్య మరింత ఎక్కువైంది. తాజాగా ట్రంప్‌ సీనియర్‌ సలహాదారుడు స్టీఫెన్‌ మిల్లర్‌కి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఇప్పటికే 20 మందికి పైగా వైట్‌హౌస్‌ సిబ్బం ది, అధికారులు, జర్నలిస్టులకి కరోనా సోక డంతో మిగిలిన వారిలో ఆందోళన మొద లైంది. మొదట్నుంచీ వైట్‌హౌస్‌లో మా స్కు లు ధరించాలన్న నిబంధన లేకపోవ డం, కరోనాపై అధ్యక్షుడు ట్రంప్‌ నిర్లక్ష్యపూరిత వైఖరే కొంపముంచిందన్న విశ్లేషణలు వినిపి స్తున్నాయి. మాస్కులు ధరించడం ద్వారా వైట్‌హౌస్‌లో కరోనా కేసుల్ని అరికట్టి ఉండ వచ్చునని అమెరికా అంటువ్యాధుల చికిత్స నిపుణుడు ఆంటోని ఫౌచీ అన్నారు. ‘‘ప్రతిరోజూ మరికొంత మంది కరోనా బారిన పడుతున్నారు. ఇది ఎంతో దురదృష్టకరం. కరోనాని అడ్డుకునే బలమైన ఆయుధం మాస్కు మన దగ్గర ఉంది. అది ధరించి ముందే నివారించి ఉండవచ్చు. కానీ అలా జరగలేదు’’అని ఫౌచీ ఆవేదన వ్యక్తం చేశారు.

కరోనా సోకిన వారు
► డొనాల్డ్‌ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
► మెలానియా, ట్రంప్‌ భార్య
► స్టీఫెన్‌ మిల్లర్, సీనియర్‌ సలహాదారు
► హోప్‌ హిక్స్, సీనియర్‌ సలహాదారు
► కేలే మెకానీ, వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ
► జాలెన్‌ డ్రమండ్, అసిస్టెంట్‌ ప్రెస్‌ సెక్రటరీ
► బిల్‌ స్టీఫెన్, ట్రంప్‌ ప్రచారకుడు
► చాద్‌ గిల్‌మార్టిన్, వైట్‌ హౌస్‌ ప్రెస్‌ స్టాఫర్‌
► జైనా మెక్‌కారెన్, ట్రంప్‌ మిలటరీ అసిస్టెంట్‌
► కరొలైన్‌ లెవిట్, వైట్‌హౌస్‌

కమ్యూనికేషన్‌ అసిస్టెంట్‌
► అడ్మిరల్‌ చార్లెస్‌ రే, తీరప్రాంత వైస్‌ కమాండెంట్‌
► రోనా మెక్‌డేనియల్, ఆర్‌ఎన్‌సీ చైర్‌ ఉమెన్‌
► మైక్‌ లీ, ఉటా సెనేటర్‌
► థామ్‌ టిల్లీస్, నార్త్‌ కరోలినా సెనేటర్‌
► కెల్యానె కాన్వే, మాజీ సీనియర్‌ సలహాదారు
► క్రిస్‌ క్రిస్టీ, న్యూజెర్సీ మాజీ గవర్నర్‌
► మరో ఇద్దరు వైట్‌హౌస్‌ కీపింగ్‌ సిబ్బంది, ముగ్గురు పాత్రికేయులు

కరోనా తగ్గకుండా బిగ్‌ డిబేట్‌ వద్దు: బైడెన్‌
వైట్‌హౌస్‌కి చేరుకున్న అ«ధ్యక్షుడు ట్రంప్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలన్న ఉత్సాహంలో ఉన్నారు. ట్రంప్‌ ఆరోగ్యంగా ఉన్నారని, ఆక్సిజన్‌ లెవల్స్‌ సాధారణ స్థితిలోనే ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. దీంతో అక్టోబర్‌ 15న డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌తో జరగనున్న రెండో బిగ్‌ డిబేట్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటూ ట్వీట్‌ చేశారు. అయితే ట్రంప్‌కి కరోనా పూర్తిగా తగ్గకుండా డిబేట్‌ నిర్వహించడం సరికాదని బైడెన్‌ అన్నారు.

ఉద్దీపనలపై చర్చలొద్దు!
కరోనా కారణంగా దెబ్బతిన్న రంగాలను ఆదుకునేందుకు ప్రకటించదలిచిన ఉద్దీపనలపై డెమొక్రాట్స్‌తో చర్చలు నిలిపివేయాలని అధ్యక్షుడు ట్రంప్‌ ఆదేశించారు. డెమొక్రాట్‌ నేత నాన్సీ పెలొస్కీ ఉద్దీపన చర్చల్లో సరిగా పాల్గొనడంలేదని విమర్శించారు. అందుకే ఉద్దీపనలపై చర్చలను ఆపమని ఆదేశించానని, తాను తిరిగి ఎన్నికయ్యాక ఒక బడా ప్యాకేజీని ప్రవేశపెడతానని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. ఎన్నికలకు ముందే ఒక ప్రధాన ప్యాకేజీని ఇచ్చేందుకు వైట్‌హౌస్‌ అధికారులు డెమొక్రాట్లతో చర్చిస్తున్నారు.

సూపర్‌ స్ప్రెడర్‌ రోజ్‌ గార్డెన్‌ !
సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా అమీ కోనే బారెట్‌ను నామినేట్‌ చేసే కార్యక్రమాన్ని సెప్టెంబర్‌ 26న అధ్యక్షుడు ట్రంప్‌ రోజ్‌ గార్డెన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా కరోనా వ్యాపించి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్, ఇతర సిబ్బంది 200 మంది వరకు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కానీ ఏ ఒక్కరూ మాస్కులు ధరించలేదు. భౌతిక దూరాన్ని కూడా పాటించలేదు. ఆ తర్వాత ఎన్నికల ప్రచార ర్యాలీల్లో అధ్యక్షుడు విస్తృతంగా పాల్గొన్నారు. ఆయన వెంట వైట్‌ హౌస్‌ సిబ్బంది చాలా మంది ఉన్నారు. ఈ ర్యాలీల్లో కూడా ఎక్కడా కోవిడ్‌ నిబం« దనలు పాటించిన దాఖలాలు లేవు. దీంతో కరోనా విజృంభణ కొనసాగు తోందని వైద్య నిపుణులు అభిప్రాయపడు తున్నారు.

మరిన్ని వార్తలు