Sterilizing Cure HIV: 30 ఏళ్ల మహిళలో హెచ్‌ఐవీ మాయం!

23 Nov, 2021 18:31 IST|Sakshi

హెచ్‌ఐవీకి మందు లేదు.. నివారణ, చికిత్సలు అందించినా బతకటం చాలా కష్టం. అయితే 8ఏళ్ల క్రితం హెచ్‌ఐవీ బారినపడ్డ ఓ మహిళ శరీరంలో వైరస్‌ కాస్త మాయమైపోంది. గతంలో ఆమె శరీరంలో గుర్తించిన హెచ్‌ఐవీ వైరస్‌ ప్రస్తుతం లేదని వైద్య పరిశోధకులు తెల్చిచెప్పారు. అర్జెంటీనాలోని ఎస్పెరాన్జాకు చెందిన 30ఏళ్ల ఓ మహిళ కొన్ని ఏళ్ల నుంచి ఎటువంటి మందులు వాడకున్నా ఆమెలో హెచ్‌ఐవీ వైరస్‌ కనిపించలేదని అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ ఓ పబ్లికేషన్‌లో పేర్కొంది. అదీకాక హెచ్‌ఐవీ వైరస్‌ ఆమె డీఎన్‌ఏలో కూడా కనిపించలేదని తెలిపింది.

చదవండి: 1959లో హత్యాచారం.. డీఎన్‌ఏ టెస్ట్‌తో ఇప్పుడు తీర్పు.. ట్విస్ట్‌ ఏంటంటే

హెచ్‌ఐవీ సోకినవారిపై వైరస్‌ ప్రభావం చూపే క్రమంలో ‘స్టెరిలైజింగ్‌ క్యూర్‌’ అయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. కానీ ఇలా జరగడం ఓ మిస్టరీని తెలిపింది. అయితే ఏ విధంగా ఆమె శరీరం నుంచి హెచ్‌ఐవీ నివారించబడిందనే విషయాన్ని మాత్రం పరిశోధకులు వెల్లడించలేదు. కానీ, ఆమె శరీరతత్వాన్ని బట్టి ఇది సాధ్యమైనట్లు పేర్కొన్నారు.

ఆమెలోని రక్తం, కణజాలాలను పరిశీలించినప్పుడు సహజంగానే హెచ్‌ఐవీ నుంచి నివారించబడినట్లు బ్యూనస్ ఎయిర్స్‌లోని రెట్రో వైరస్, ఎయిడ్స్‌ సంబంధించి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ రీసెర్చ పరిశోధకులు పేర్కొన్నారు. ‘స్టెరిలైజింగ్‌ క్యూర్‌’ చాలా అరుదైన సంఘటనని అయితే అది సాధ్యమవడానికి అవకాశం ఉందని వెల్లడించారు. అయితే దశాబ్దాల నుంచి డాక్టర్లు హెచ్‌ఐవీ రోగుల శరీరం నుంచి నిర్మూలించలేకపోతున్నారు.

తాజాగా హెచ్‌ఐవీ నుంచి బయటపడిన మహిళ ద్వారా మిగతా బాధితులకు ఓ నమ్మకం కలుగుతుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు  ఆ మహిళ నుంచి హెచ్‌ఐవీ వైరస్‌ ఎలా పోయిందని వైద్యుల్లో చర్చ జరుగుతోంది. అయితే ఇప్పటివరకు అమెరికాలో చెందిన ‘బెర్లిన్‌ రోగి’ అని పిలువబడే తిమోతీ రే బ్రౌన్ హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ నుంచి బయటపడిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు