స్టీవ్‌ జాబ్స్‌ ఉద్యోగ దరఖాస్తు వేలం.. ఎంతో తెలుసా?

26 Mar, 2021 13:25 IST|Sakshi

లండన్‌: స్టీవ్‌ జాబ్స్‌ అంటే తెలియనివారు ఉండరు. స్టార్టప్‌ కంపెనీలను స్ధాపించే వారికి స్టీవ్‌ ఏంతో ఆదర్శం. ప్రారంభంలో  అతను కూడా ఒక కంపెనీలో ఉద్యోగిగా చేరి, ఆపిల్‌ కంపెనీ స్థాపించడంలో ఎంతగానో కృషి చేశారు. అమెరికాలోని పోర్ట్ ల్యాండ్‌కు చెందిన రీడ్ కాలేజీ నుంచి  తప్పుకున్న తరువాత ఉద్యోగం నిమిత్తం స్టీవ్‌ ఓ ఉద్యోగానికి చేశాడు. కంప్యూటర్ డిజైన్ టెక్నీషియన్‌తో పాటు, ఇంగ్లీష్ లిటరేచర్‌ను తన నైపుణ్యంగా అప్లికేషన్‌లో పేర్కొన్నాడు.

1973లో చేసిన ఈ దరఖాస్తును యూకేలోని ప్రముఖ సంస్థ చార్టర్‌ఫీల్డ్స్ వేలం వేయగా భారీ ధరకు అమ్ముడైంది. స్టీవ్ జాబ్స్ చేతితో రాసిన ఉద్యోగ దరఖాస్తు సుమారు రూ. 1.6 కోట్లకు వేలంలో విక్రయించారు. ఈ ఏడాది  ఫిబ్రవరి 24న  ప్రారంభమైన బిడ్డింగ్‌ మార్చి 24న ముగిసింది. కాగా, స్టీవ్‌ అప్లికేషన్  వేలంలో ఇంత ధరకు  అమ్ముడవడం ఇదే మొదటిసారి కాదు, గతం లో 2018 లో ఓ ఐటీకంపెనీ వ్యవస్థాపకుడు కొనుగోలు చేశాడు.

ఆ ఇద్దరూ కలుసుకుంది అక్కడే..
1974 లో అటారీ కంపెనీలో చేరిన స్టీవ్‌ జాబ్స్‌ తన ఆపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ వోజ్నియాక్‌ను అక్కడే కలిశాడు. జాబ్స్, వోజ్నియాక్ 1976 లో అమెరికాలోని కాలిఫోర్నియాలోని లాస్ ఆల్టోస్‌లో జాబ్స్ గ్యారేజీలో ఆపిల్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. స్టీవ్‌ జాబ్స్‌ 2011లో కాన్సర్‌తో మరణించారు.
చదవండి: ఆపిల్‌ సంస్థకు భారీ జరిమానా

మరిన్ని వార్తలు