ఆ రాయిని మండిస్తే చాలు.. ఇంటర్నెట్‌, వైఫై సిగ్నల్స్‌ వస్తాయ్‌!

28 May, 2023 09:13 IST|Sakshi

మనకు ఇంటర్నెట్‌,  వైఫై సిగ్నల్స్‌ బాగా వచ్చేందుకు ఇంటి మేడపైకి, ఎత్తుగా ఉన్న ప్రదేశంలోకి వెళ్తాం. మాగ్జిమమ్‌ ఇంటర్నెట్‌ సిగ్నల్స్‌ రాకపోతే నానా తిప్పలు పడి మరీ యాక్సెస్‌ అయ్యేలా చేసుకుంటాం. కానీ అవేమి అవరసం లేకుండా ఓ అరుదైన రాయి దగ్గరికి వెళ్తే చాలు మనకు ఇంటర్నెట్‌, వైఫై సిగ్నల్‌ పనిచేస్తాయ్‌. ఇది నిజంగా నమ్మలేని నిజం. జర్మనీలో ఈ అద్భుత ఆవిష్కరణ చేశాడో ఓ వ్యక్తి. శాస్త్రవేత్తలు సైతం ఈ మ్యాజిక్‌ రాయిని చూసి ఆశ్చర్యపోయారు.

వివరాల్లోకెళ్తే..జర్మనీలో ఉంది ఈ రాయి. సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు దీన్ని చూసేందుకు ఎగబడుతున్నారు. దానిలో థర్మల్‌ ఎలక్ట్రిక్‌ జనరేటర్‌ అమర్చబడి ఉంది. దాన్ని మంటల వద్ద పెడితే వేడిని విద్యుత్‌ శక్తిగా మార్చుతుంది. ఆ తర్వాత వైఫై రూటర్‌ ఆన్ అవుతుంది. ఇంటర్నెట్‌ సిగ్నల్స్‌ ప్రారంభమవుతాయి. వాస్తవానికి అది కృత్రిమ రాయి. ఈ అరుదైన రాయి బరువు 1.5 టన్నులు. ఈ కళాకృతిని కీప్‌ అలైవ్‌ అని పిలుస్తారు. ఎరామ్‌ బర్తోల్‌ అనే వ్యక్తి దీన్ని తయారు చేశాడు. ఆ ఆవిష్కరణ కారణంగా ఆయన పేరు వార్తల్లో నిలిచింది. 

(చదవండి: కొత్త పార్లమెంట్‌ భవనం కోసం షారూఖ్‌, అక్షయ్‌ కూమార్‌ల వాయిస్‌ ఓవర్‌)

మరిన్ని వార్తలు