బిక్షాటనలో రూ.43 లక్షల లాటరీ

10 Oct, 2020 22:06 IST|Sakshi

పారిస్‌ : ఉపాధి లేక‌పోవ‌డంతో ఆ న‌లుగురు బిచ్చ‌గాళ్లుగా మారారు. వీరికి రోజూ పూట గ‌డ‌వ‌డ‌మే క‌ష్టంగా ఉండేది. బిక్షాటన చేయడం ద్వారా వ‌చ్చిన డ‌బ్బుతో క‌డుపు నింపుకునేవారు. అయితే లాటరీ టికెట్లు అమ్మే దుకాణాన్ని బిక్షాటనకు స్థలంగా ఏంచుకున్నారు. ఎందుకంటే లాట‌రీ టికెట్లు కొనేందుకు అక్క‌డికి జ‌నం ఎక్కువ‌గా వ‌స్తార‌నేది వీరి ప్లాన్‌. అవతలి వారికి లాటరీ తగులుతుందే లేదో తెలియదు గానీ కస్టమర్లు పారేసిన లాటరీ టికెట్లను భద్రంగా ఉంచుకునేవారు. ఏదోఒక రోజు వారికి ఆ లాటరీ టికెట్ల రూపంలో లక్షలు తగిలే అవకాశం ఉండవచ్చన్నది. (చదవండి : భారత సరిహద్దులో 60 వేల చైనా సైన్యం: అమెరికా)

ఆరోజు రానే వచ్చింది. ఒక‌రోజు అక్క‌డికి ఓ యువ‌తి వ‌చ్చి లాట‌రీ టికెట్ కొన్నారు. అప్పటికే ప‌క్క‌నే ఉన్న ఆ నలుగురు బిచ్చ‌గాళ్లు దానం చేమ‌య‌ని యువతిని ప్రాదేయ‌ప‌డగా ఆమె ఏం ఆలోచించకుండా చేతిలో ఉన్న లాట‌రీ టికెట్‌ను బిక్షంగా వేసింది. బిక్షమడిగితే డబ్బులు ఇవ్వకుండా ఎందుకు ప‌నికిరాని లాటరీ టికెట్ చేతిలో పెట్టిందేంటి అనుకున్నారు. అయితే లాటరీ టికెట్‌ను స్క్రాచ్‌ చేసి చూడగానే వారి కళ్లు బైర్లు కమ్మాయి. దాదాపు 50వేల యూరోలు( దాదాపు రూ. 43లక్షల రూపాయలు) వారికి లాట‌రీగా త‌గ‌లింది.

పాపం ఆ యువతి తాను కొన్ని టికెట్‌ను కనీసం స్క్రాచ్ చేయ‌కుండా ఎందుకు వీరికి బిచ్చ‌మేసిందో తెలియదుగాని వారిని లక్ష్మీదేవి కనికరించింది. అయితే లాట‌రీ నిజంగా గెలుచుకున్నామా లేదా అనే సంగతి తెలుసుకోవడానికి ఫ్రెంచ్‌ లాటరీ ఆపరేటర్‌ ఎఫ్‌డీజేను కలుసుకున్నారు. వారికి నిజంగానే లాటరీలో డబ్బు వచ్చిందని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. యువతి దానం చేసిన లాట‌రీలో గెలుచుకున్న డ‌బ్బులు వీరికే సొంతమ‌ని పేర్కొంది.(చదవండి : కరోనా వ్యాక్సిన్‌ను అడ్డుకుంటారా ?!)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా