పేదరికంలో మగ్గుతున్న గురువును ఆదుకోవటానికి..

14 Mar, 2021 16:41 IST|Sakshi

వాషింగ్టన్‌ : పేదరికంలో మగ్గిపోతున్న తన గురువును ఆదుకోవటానికి 21 ఏళ్ల ఓ యువకుడు ముందుకొచ్చాడు. ఆయన కోసం విరాళాలు సేకరించి ఏకంగా 19 లక్షలు అందించాడు. వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన  77 ఏళ్ల జోష్‌ స్కూల్‌ టీచర్‌గా రిటైర్‌ అయ్యారు. ఇక అప్పటినుంచి ఆర్థికంగా ఇబ్బందులపాలై పేదరికం అనుభవిస్తున్నారు. ఉండటానికి ఇళ్లు కూడా లేని స్థితిలో కారులో నివసిస్తున్నారు. జోష్‌ పేదరికంలో మగ్గుతున్నారని తెలిసిన ఆయన పాఠాలు చెప్పిన పూర్వ విద్యార్థి 21 ఏళ్ల నోవా చలించిపోయాడు. జోష్‌ కోసం ఏదైనా చేయాలనుకున్నాడు. తన వంతుగా 300 డాలర్లు అందించాడు.

ఆ డబ్బుతో ఆయన ఆర్థిక పరిస్థితి మెరుగుపడదని భావించి గోఫండ్‌ మీ పేరిట టిక్‌టాక్‌లో క్యాంపైన్‌ ప్రారంభించాడు. దీంతో కొద్ది నెలల్లోనే 27 వేల డాలర్ల(19లక్షలు) విరాళాలు అందాయి. ఈ మొత్తాన్ని జోష్‌ పుట్టిన రోజున చెక్‌ రూపంలో గిఫ్ట్‌గా ఇచ్చాడు నోవా. దీనిపై నోవా మాట్లాడుతూ.. ‘‘ సోషల్‌ మీడియా పవర్‌ చాలా పెద్దది. కొన్ని సార్లు మంచి పనులకు కూడా దాన్ని ఉపయోగించవచ్చు’’ అని అన్నాడు.

చదవండి : గవర్నర్‌ పదవికి పోటీ.. జోకర్‌ వేషంలో నామినేషన్‌

 నిద్రపోతున్న మహిళను చనిపోయిందనుకుని..

మరిన్ని వార్తలు