అమెరికాలో 10 వేల డాలర్ల దాకా విద్యార్థి రుణాల మాఫీ

25 Aug, 2022 04:44 IST|Sakshi

వాషింగ్టన్‌: ఎన్నికల హామీలను నెరవేర్చే క్రమంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మరో కీలక ముందడుగు వేశారు. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న విద్యార్థుల రుణాల మాఫీ పథకాన్ని ప్రకటించారు. ఇందులో భాగంగా 1.25 లక్షల డాలర్ల కంటే తక్కువ వార్షిక ఆదాయమున్న వారికి 10 వేల డాలర్ల విద్యార్థి రుణాలను మాఫీ చేస్తారంటూ బుధవారం ట్వీట్‌ చేశారు. న్యాయపరమైన అడ్డంకుల్ని తట్టుకుని ఈ పథకం అమల్లోకి వస్తే లక్షలాది మంది అమెరికా విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.

అలాగే ఆర్థికంగా వెనకబడ్డవారికి అదనంగా మరో 10 వేల డాలర్ల దాకా రుణ మాఫీ అందనుంది. అమెరికాలో 4.3 కోట్ల మంది పై చిలుకు మంది సగటున ఒక్కొక్కరు 37 వేల డాలర్ల చొప్పున విద్యార్థి రుణాలు తీసుకున్నారు. బైడెన్‌ నిర్ణయంతో వీరిలో కనీసం 2 కోట్ల మంది రుణాలు పూర్తిగా రద్దవుతాయని అంచనా. చదువుకునేందుకు విద్యార్థ రుణాలపై ఎక్కువగా ఆధారపడే నల్ల జాతి అమెరికన్లకు పథకంతో మేలు జరుగుతుందని సమాచారం. 

మరిన్ని వార్తలు