ఇలాంటి అద్భుతాలు అరుదుగా జ‌రుగుతాయి

1 Aug, 2020 22:03 IST|Sakshi

మెక్సికో : విశ్వంలో మ‌నం నివ‌సిస్తున్న భూమి ఎంత అందంగా కనిపిస్తుందో.. పైన క‌నిపించే ఆకాశం కూడా అంతే అద్భ‌తంగా క‌నిపిస్తుంది. సాధారణంగా ఎలాంటి మ‌బ్బులు లేక‌పోతే చుక్క‌ల వెలుగుల్లో రాత్రి వేళ ఆకాశాన్ని ప‌రిశీలిస్తే దానికి మించిన మ‌జా ఇంకోటి ఉండదు. పైగా ఆకాశంలో మ‌న భూమిమీద నుంచి ఇత‌ర గ్ర‌హాలైన శుక్రుడు, గురుడు, శ‌నిగ్ర‌హం వంటివి న‌క్ష‌త్రాల్లా మెరుస్తూ క‌నిపిస్తాయి.  అస‌లు ప్రకృతిలో చోటుచేసుకునే అందాలు గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే అవుతుంది. కానీ ఇప్ప‌టి జ‌నాలు బిజీ లైఫ్‌లో ప‌డి ప్రకృతి సౌంద‌ర్యాలను ఆస్వాదించ‌డం మ‌రిచిపోతున్నారు.('మ‌న ప‌రిస్థితి కూడా సీతాకోక‌చిలుకలాగే..')

తాజాగా మెక్సికోలోని తావోస్‌లో ఒక అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. ఆకాశంలో ఒక‌ ఉల్కాపాతం జరిగింది. ఆ సమయంలో మ్యుజిషియ‌న్ అయిన‌ అంబెర్ కఫ్మాన్‌కి మెరుస్తున్న‌ ఉల్క ఒక‌టి కనిపించింది. అది ఆకాశంలో అలా వెళ్తుంటే ఆశ్చర్యపోతూ వీడియో తీశారు. తన జీవితంలో ఎప్పుడూ అలాంటిది చూడలేదనీ, ఇదో అద్భుతమని చెబుతూ.. అంబెర్ ఆ వీడియోని ట్విట్టర్‌లో షేర్ చేశారు. సాధారణంగా ఉల్కలు అంత‌ స్పష్టంగా కనిపించవు. ఈ వీడియోలో మాత్రం  ఉల్క నిప్పులు చిమ్ముతూ... కాంతివంతంగా మెరిసిపోతూ... దూసుకెళ్లింది. జులై 29న పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇప్పటికే 33 లక్షల మంది ఈ వీడియోను చూడ‌గా.. దాదాపు 2లక్షల మందికి పైగా లైక్ చేశారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా