రికార్డు బ్రేక్‌ ‘వీలీ’ స్టంట్‌ 

8 Oct, 2022 02:35 IST|Sakshi

రోడ్డుపై బైక్‌లతో కుర్రకారు చేసే విన్యాసాలను మనలో చాలా మంది చూసే ఉంటాం.. బండిని మెలికలు తిప్పుతూ పోనీయడం.. ముందు చక్రాన్ని పైకి లేపి యాక్సిలేటర్‌ను రెయిజ్‌ చూస్తూ దూసుకుపోవడం, అత్యంత వేగంగా బండిని నడుపుకుంటూ వచ్చి వెనుక చక్రం పైకి లేచేలా ఒక్కసారిగా బ్రేక్‌ వేయడం... బండిని ఉన్నచోటనే గుండ్రంగా తిప్పడం వంటి స్టంట్లను మీరు చూసే ఉంటారు.

కానీ లిథువేనియాకు చెందిన అరునస్‌ గిబేజా అనే స్టంట్‌ రైడర్‌ వీటన్నింటికన్నా క్లిష్టమైన ఓ విన్యాసాన్ని చేసి చూపించి సరికొత్త గిన్నిస్‌ రికార్డు సృష్టించాడు. ఇంతకీ అతను చేసిన స్టంట్‌ ఏమిటంటే... బండిని కేవలం వెనుక చక్రంపై నడపడమే (వీలీ) కాకుండా హ్యాండిల్‌ను వదిలేసి ఏకంగా అర కిలోమీటర్‌కుపైగా దూరం (580 మీటర్ల 81 సెంటీమీటర్లు) దూసుకెళ్లాడు. తద్వారా 2019లో భారత్‌కు చెందిన రోహితేశ్‌ ఉపాధ్యాయ్‌ అనే యువకుడు సుమారు 566 మీటర్ల దూరంపాటు ఇదే రకంగా బండి నడిపి నమోదు చేసిన గిన్నిస్‌ రికార్డును బద్దలుకొట్టాడు.   

మరిన్ని వార్తలు