విషాదం: ప్రపంచ రికార్డ్‌ కోసం ఫీట్‌ చేసి ప్రాణాలు కోల్పోయాడు 

22 Jun, 2021 09:58 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికాకు చెందిన అలెక్స్ హార్విల్(28) అనే యువకుడు వరల్డ్‌ రికార్డ్‌ కోసం బైక్‌తో స్టంట్‌ చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు.   వాషింగ్టన్‌లోని మోసెస్‌ లేక్‌ విమానాశ్రయంలో గురువారం  ఈ ఘటన చోటు చేసుకుంది. స్టంట్‌ మాన్‌ హార్విల్‌ 351 అడుగులు జంప్‌ చేసి గిన్నిస్‌ రికార్డ్‌ బద్దలు కొట్టాలనుకున్నాడు. దీని కోసం మోటార్‌ సైకిల్‌ రాంప్‌ ఏర్పాటు చేసి, ఓ మట్టి దిబ్బపై జంప్‌ చేయడానికి ప్రయత్నించాడు . ఈ క్రమంలో తీవ్ర గాయాలపాలైన  హాలెక్స్‌  అక్కడే కుప్పకూలి చనిపోయాడు. స్టంట్ మాన్ అలెక్స్ హార్విల్ మరణం డర్ట్ బైక్ జంపింగ్ డేర్ డెవిల్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

కాగా, అలెక్స్ హార్విల్ స్టంట్ కోసం ప్రయత్నిస్తూ.. మరణించినట్లు గురువారం గ్రాంట్ కౌంటీ కరోనర్ కార్యాలయం ధృవీకరించింది. అలెక్స్ మృతి పట్ల అతడి కుటుంబానికి, స్నేహితులకు, ప్రియమైనవారికి గ్రాంట్ కౌంటీ కరోనర్ కార్యాలయం ప్రగాఢ సానుభూతి తెలిపింది. కాగా, కాలిఫోర్నియాలోని కరోనాలో జన్మించిన హార్విల్ ఇప్పటికే ఓ ప్రపంచ రికార్డ్ సాధించాడు.  జూలై 2013లో హార్విల్ మోటారుసైకిల్‌పై 297 అడుగుల పొడవైన ‘డర్ట్-టు-డర్ట్ రాంప్ జంప్’  తో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ సాధించాడు.

చదవండి: Sanjay Raut: మహావికాస్‌ ఆఘాడి కూటమి బలంగా ఉంది

చదవండి: వైరల్‌ వీడియో: మెట్రో ఎక్కిన కోతి.. మరి టికెట్‌ ఏది?

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు