కదిలిన ఓడ.. దృశ్యాలు వైరల్‌‌‌‌‌‌‌‌‌

29 Mar, 2021 20:09 IST|Sakshi

సూయజ్‌ కాలువలో ఇరుక్కుపోయిన ఎవర్‌ గ్రీన్‌ భారీ ఓడ ఎట్టకేలకు కదిలింది. ఆ ఓడ కదలడంతో ప్రపంచ దేశాలు హర్షం వ్యక్తం చేశాయి. ఇక వాణిజ్య ఓడలు రాకపోకలు సాగించేందుకు మార్గం సుగమమైంది. దాదాపు వారం పాటు సముద్రంలో ఏర్పడిన ట్రాఫిక్‌ జామ్‌ క్లియర్‌ కానుంది. ఓడ కదులుతున్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మధ్యదరా సముద్రం నుంచి ఎర్ర సముద్రం మధ్య ఉన్న ఈ కాలువలో పెద్ద ఎత్తున ఓడలు ప్రయాణిస్తుంటాయి. వాణిజ్య ఓడల ప్రయాణం కోసం ఈ కాలువ నిర్మించారు. 

కాలువలో చిక్కుకున్న భారీ నౌకతో రోజుకు రూ.72 వేల కోట్ల చొప్పున వారం రోజులుగా నష్టం ఏర్పడింది. దీంతో ప్రపంచ ఆర్థికవ్యవస్థ అతలాకుతలమైంది. ప్రపంచంలో పదోవంతు వ్యాపారం జరిగే సూయజ్ కాలువలో ఇరుక్కున్న ఈ భారీ నౌక ఎట్టకేలకు కదిలింది. ఈ ఓడను కదిలించడంలో భారతదేశానికి చెందిన నౌక నిపుణులు కూడా వెళ్లారని తెలుస్తోంది. ఈ నౌకను కదిలించేందుకు పలు దేశాలు కూడా ముందుకు వచ్చి చర్యలు తీసుకున్నాయి. సమష్టి కృషితో ఎట్టకేలకు ఎవర్‌ గ్రీన్‌ ఓడను కదిలించారు. ఆ ఓడ నీటిలోకి చేరడంతో అక్కడి శ్రామికులు, అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సూయజ్ కెనాల్ అథారిటీ చైర్మన్ ఒసామా రాబీ తెలిపారు. మధ్యదరా సముద్రం నుంచి ఎర్ర సముద్రం మధ్య ఈ సూయజ్‌ కాలువ ఉంది. ఈ పరిణామంపై ప్రపంచ దేశాలు హర్షం వ్యక్తం చేశాయి.

మరిన్ని వార్తలు