మీకు తెలుసా..? డయాబెటీస్‌ పేషెంట్లకు ప్రత్యేక మామిడి పండ్లు

28 Jun, 2021 10:59 IST|Sakshi

మారుతున్న జీవన శైలి కారణంగా మనిషి శరీరం అనేక వ్యాధులకు నిలయంగా మారింది. ఈ వ్యాధులలో ఒకటి డయాబెటీస్. దీన్నే మధుమేహం, డయాబెటీస్‌, చక్కెర వ్యాధి అని అంటారు. డయాబెటీస్‌.. చాపకింద నీరులా సోకే వ్యాధి. ఇక డయాబెటిస్ ఉన్నవారు ఏవైనా పండ్లు తీసుకోవాలనుకుంటే.. ముఖ్యమైన మామిడి పండ్లను తినాలంటే చక్కెర స్థాయి అధికంగా ఉంటుందేమో అని ఆందోళన చెందుతారు. కానీ ప్రస్తుతం పాకిస్తాన్‌ మార్కెట్‌లో చక్కెర స్ఠాయిలు తక్కువగా ఉండే మామిడి పండ్లను విక్రయిసు​న్నారు.

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌కి చెందిన మామిడి పండ్ల నిపుణుడు గులాం సర్వర్ చక్కెర స్థాయిలు తక్కువగా ఉండే మామిడి పండ్లను కనుగొన్నారు. పాకిస్తాన్‌లో 'ఆమ్ ఆద్మీ' కోసం  తక్కువ ధరలకు , ముఖ్యంగా డయాబెటీస్‌ పేషంట్స్‌ కోసం ఈ మామిడి పండ్లను విక్రయిసు​న్నారు. ప్రస్తుతం ఈ పండ్లు సోనారో, గ్లెన్, కీట్ పేర్లతో  సింధ్ టాండో అల్లాహార్‌లోని ఎంహెచ్‌ పన్వర్ ఫార్మ్స్ అనే ప్రైవేట్ వ్యవసాయ క్షేత్రంలో పండిస్తున్నారు.

పాకిస్తాన్ మార్కెట్లలో కిలో రూ.150
‘‘సింధ్రీ, చౌన్సా వంటి రకాల్లో 12 నుంచి 15శాతం చక్కెర ఉండగా, పన్వర్ ఫార్మ్‌లో కొన్ని రకాలు కేవలం 4 నుంచి 5శాతం చక్కెర స్థాయిని కలిగి  ఉన్నాయి. కీట్ రకంలో అత్యల్ప చక్కెర స్థాయి 4.7 శాతం వరకు ఉంది. సోనారో, గ్లెన్‌ చక్కెర స్థాయి వరుసగా 5.6శాతం, 6శాతం వరకు ఉన్నాయి. ప్రస్తుతం ఈ మామిడిపండ్లు పాకిస్తాన్ మార్కెట్లలో కిలో రూ.150కు లభిస్తున్నాయి." అని మామిడి పండ్ల నిపుణుడు గులాం సర్వర్  తెలిపారు.

300 ఎకరాల పొలంలో 44 రకాలు
దీనిపై ఎంహెచ్‌ పన్వర్‌ మేనల్లుడు మాట్లాడుతూ.. ‘‘ మామిడి, అరటితో సహా ఇతర పండ్లకు సంబంధించిన పరిశోధనల కోసం పాకిస్తాన్‌ ప్రభుత్వం పన్వర్‌కు సీతారా-ఇ-ఇమ్తియాజ్‌ను ప్రదానం చేసంది. అతని మరణం తర్వాత, నేను ఆ పనిని కొనసాగిస్తున్నాను. ఇక​ ఇక్కడి వాతావరణం, మట్టిని పరీక్షించిన తరువాత వివిధ రకాల మామిడి సండ్లను దిగుమతి చేసుకుని మార్పులు చేశాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం లేకున్నా ప్రాజెక్టును వ్యక్తిగత ప్రాతిపదికన నడుపుతున్నామని, ప్రస్తుతం తమకు ఉన్న 300 ఎకరాల పొలంలో 44 రకాల మామిడి పండ్లు అందుబాటులో ఉన్నాయి.’’ అని తెలిపారు.

చదవండి:
లాడెన్‌ అమరవీరుడంటూ నోరు జారిన ఇమ్రాన్‌.. వరుస వివరణలు
పుల్వామాలో ఉగ్రదాడి కలకలం

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు