పాక్‌లో ఆత్మాహుతి దాడి.. ఐదుగురు జవాన్లు మృతి

5 Sep, 2021 17:55 IST|Sakshi

క్వెట్టా: పాకిస్తాన్‌లో నైరుతి ప్రావిన్స్ బలూచిస్తాన్ లోని క్వెట్టా నగరంలో పారా మిలటరీ సైనికులపై ఆత్మాహుతి దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో పాక్‌ జవాన్లు ఐదుగురు మ‌ర‌ణించ‌గా.. 20 మంది వ‌ర‌కూ గాయ‌ప‌డ్డారు. కాగా తెహ్రీకె తాలిబ‌న్ పాకిస్థాన్ (టీటీపీ) ఈ దాడికి తామే బాధ్యులమని ప్రకటించింది. క్వెట్టా-మాస్తంగ్ రోడ్డులోని చెక్‌పాయింట్ ద‌గ్గ‌ర ఈ దాడి జ‌రిగింది.

చెక్‌పోస్ట్ ద‌గ్గ‌ర ఉన్న పోలీసుల‌పైకి ఓ వ్య‌క్తి బైక్‌పై దూసుకొచ్చి త‌న‌ను తాను పేల్చేసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ దాడిలో ముగ్గురు పారామిలిట‌రీ సిబ్బంది మ‌ర‌ణించిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ట్విటర్‌ ద్వారా ఈ ఘటనను ఖండించారు. ఈ దాడిలో మ‌ర‌ణించిన వారి కుటుంబాల‌కు సంతాపం తెలిపారు. బ‌లూచిస్తాన్ హోంమంత్రి మీర్ జియావుల్లా కూడా ఈ దాడిని ఖండించారు.

చదవండి: Panjshir: పంజ్‌షీర్‌ ప్రతిఘటన దళాల దెబ్బ?.. గందరగోళంగా అఫ్గన్‌ ఆధిపత్యపోరు

మరిన్ని వార్తలు