Kabul Blast: రష్యా ఎంబసీ వద్ద టెన్షన్‌.. ఆత్మాహుతి దాడిలో 25 మంది మృతి!

5 Sep, 2022 15:59 IST|Sakshi

తాలిబన్‌ పాలిత ఆప్ఘనిస్తాన్‌లో​ కొద్దిరోజులుగా వరుస బాంబు పేలుళ్లు చోటుచేసుకుంటున్నాయి. సోమవారం కాబూల్‌లో భారీ బాంబ్‌ బ్లాస్ట్‌ జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 25 మందికిపైగా మృతిచెందినట్టు ఆ దేశ మీడియాలో ఓ ప్రకటనలో పేర్కొంది. 

వివరాల ప్రకారం..  కాబూల్‌లోని రష్యా రాయబార కార్యాలయం సమీపంలో సోమవారం బాంబ్‌ బ్లాస్ట్‌ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడి కారణంగా బ్లాస్ట్‌ జరిగింది. సదరు వ్యక్తి రష్యా రాయబార కార్యాలయంలోని ప్రవేశించి లక్ష్యాన్ని చేరుకోవడానికి ముందే ఆత్మాహుతి దాడి చేసిన వ్యక్తిని తాలిబాన్ గార్డులు గుర్తించి కాల్చిచంపినట్టు పోలీసు అధికారి మవ్లావి సాబిర్ తెలిపారు. కాగా, ఈ పేలుడు ఘటనలో దాదాపు 25 మందికిపైగా మృతి చెందినట్లు సమాచారం. మృతుల్లో ఇద్దరు రష్యా దౌత్యవేత్తలు కూడా ఉన్నట్లు తెలుస్తున్నది. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరోవైపు.. ఇటీవలే హెరాత్‌ ప్రావిన్స్‌లో గుజార్గా మసీదులోనూ శుక్రవారం ప్రార్థనల సమయంలో పేలుడులో మతపెద్ద ముజీబ్ ఉల్ రెహ్మాన్ అన్సారీ, అతని భద్రతా సిబ్బంది సహా 18 మంది ప్రాణాలు కోల్పోయారు. 

ఇది కూడా చదవండి: అమెరికాలో భారత మహిళలపై జాతివివక్ష దాడి.. ఇండియాకు వెళ్లిపోండి అంటూ..

మరిన్ని వార్తలు