ట్విటర్‌: క్షమాపణలు చెప్పిన ఎలన్‌ మస్క్‌! ఎందుకంటే..

14 Nov, 2022 09:16 IST|Sakshi

శాన్ ఫ్రాన్సిస్కో(కాలిఫోర్నియా): ట్విటర్‌(ట్విట్టర్‌) కొత్త బాస్‌, ప్రపంచ అపర కుబేరుడు ఎలన్‌ మస్క్‌.. క్షమాపణలు చెప్పాడు. చాలా దేశాల్లో ఈ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ పని తీరు నిదానించింది. ఈ  సూపర్‌ స్లో పరిణామంపై ఆదివారం స్పందించిన మస్క్‌.. క్షమాపణలు తెలియజేశాడు. అంతకుముందు.. 

‘ట్విట్టర్ మరింత సజీవంగా అనిపిస్తుంది’ అంటూ ఎలన్‌ మస్క్‌ ఓ ట్వీట్‌ చేశారు. ఇక  ‘ఎనిదిమి డాలర్ల’ ట్విట్టర్ బ్లూ ప్రోగ్రామ్‌ను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంపైనా ఆయన ఓ యూజర్‌కి రిప్లై ఇచ్చారు. అలాగే.. యూజర్లకు అందుబాటులోకి రాబోయే మరో కొత్త ఫీచర్‌ను ప్రకటించారాయన. సంస్థలకు సంబంధించి ఏ ఇతర ట్విటర్‌ ఖాతాలు వాటితో అనుబంధించబడి ఉన్నాయో గుర్తించడానికి వీలుగా సదరు సంస్థలకు అనుమతులు ఇవ్వబోతున్నట్లు ట్విటర్‌ తరపున ప్రకటించారాయన. 

ఇక నకిలీ ఖాతాలు పెరిగిపోవడంతో  ‘బ్లూటిక్‌’ సబ్‌స్క్రిప్షన్‌ సదుపాయాన్ని నిలిపివేసింది కదా. దానిని ఎప్పుడు పునరుద్ధరిస్తారనే ప్రశ్నకు ట్విటర్‌ సీఈవో మస్క్‌ స్పందించారు. వచ్చేవారాంతంలోగా తిరిగి ట్విటర్‌ బ్లూ సేవల్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారాయన.

ఇదీ చదవండి: 8 డాలర్ల స్కీమ్‌.. మస్క్‌ అనాలోచిత నిర్ణయం!

మరిన్ని వార్తలు