పనోడి సాయంతో పేషెంట్‌కి సర్జరీ..దెబ్బతో ఆ వైద్యుడి..

21 May, 2023 16:43 IST|Sakshi

వైద్యులు రోగికి చికిత్స చేసేటప్పుడూ ట్రైయినింగ్‌ అవుత్ను నర్సు లేదా కనీసం వైద్యా విధానంపై కనీస అవగాహన ఉన్న వ్యక్తి సాయం తీసుకోవడం జరుగుతుంది. అలాకాకుండా ఏ మాత్రం వైద్యం గురించి అవగాహన లేని ఓ సాధారణ వ్యక్తి అదీకూడా ఆస్పత్రిని క్లీన్‌ చేసే వ్యక్తి సాయం తీసుకుంటే.. ఎవ్వరికైన వొళ్లు మండిపోతుంది. అందులో ఏ మాత్రం సందేహం లేదు. ఎందుకంటే.. ఒకవేళ పేషెంట్‌కి ఏదైన సమస్య ఎదురైతే ఆ తప్పుని సరిచేయడం అనేది అసాధ్యం. కానీ ఒక వైద్యుడు అలానే చేసి ఉద్యోగం పోగొట్టుక్నునాడు. ఈ షాకింగ్‌ ఘటన జర్మనీలో చోటు చేసుకుంది. 

వివరాల్లోకెళ్తే..జర్మనీలో మెయిన్జ్ యూనివర్శిటీకి చెందిన ఆస్పత్రిలో ఓ వైద్యుడు ఒక పేషెంట్‌కి కాలు తీసేవేసే ఆపరేషన్‌ చేయాల్సి ఉంది. ఐతే ఆ సమయంలో సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఆయన ఓ క్లీనర్‌ సాయం తీసుకున్నాడు. పేషెంట్‌కి మత్తుమందు ఇచ్చిన తర్వాత అతని కాలుని పట్టుకోమని చెప్పి వైద్య పరికారలను అందించమని కోరాడు. దీంతో సదరు క్లీనర్‌ ఆ వైద్యుడు సర్జరీలో సాయం అందించి ఆపరేషన్‌ థియోటర్‌ నుంచి బయటకు రావడంతో గమనించిన ఆస్పత్రి యాజమాన్యం ఆ వైద్యుడిపై ఫైర్‌ అయ్యింది.

ఇదిలా ఉండగా,  సర్జరీ చేయించుకున్న పేషెంట్‌కి ఎలాంటి హాని జరగలేదు. అతను సురక్షింతంగానే ఉన్నాడు. కానీ ఇలాంటి క్లిష్టమైన స్థితిలో సాయం చేసే మెడికల్‌ సిబ్బంది గురించి వాకబు చేయాలి లేదా ఆస్పత్రి యాజమాన్యం దృష్టికి తీసుకురావలి గానీ అలా చేయకూడదంటూ సదరు వైద్యుడికి ఆస్పత్రి యాజమాన్యం చివాట్లు పెట్టింది. ఈ ఘటన కారణంగా సదరు వైద్యుడు ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఈ షాకింగ్‌ ఘటన 2020లో జరిగినట్లు స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఘటన ఆన్‌లైన్‌లో తెగ వైరల్‌ అవుతోంది. 

(చదవండి: ఉక్రెయిన్‌పై పట్టు సాధిస్తున్న రష్యా బలగాలు.. పుతిన్‌ అభినందనల వెల్లువ)

మరిన్ని వార్తలు