కరోనా బాధితుల్లారా మరికొన్నాళ్లు జాగ్రత్త

9 Jan, 2021 12:49 IST|Sakshi

వాషింగ్టన్‌: మహమ్మారి వైరస్‌ కరోనా నుంచి కోలుకున్నా కూడా అది శరీరంలో దాదాపు 8 నెలల వరకు దాగి ఉంటుందని ఓ సర్వే చెప్పింది. రోగ నిరోధక శక్తి అతి తక్కువగా ఉండడంతో వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని ఆ సర్వే నివేదిక తెలిపింది. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న 2020 జూలై నెలలో చేసిన సర్వేలో ఈ ఫలితాలు వెల్లడయ్యాయి.  కరోనా సోకిన తర్వాత శరీరంలో రోగ నిరోధక శక్తి క్షీణిస్తుందనేది అందరికీ తెలిసిందే. అయితే కోలుకున్న తర్వాత కూడా రోగ నిరోధక శక్తి అంతత మాత్రమే ఉంటుందని అమెరికాకు చెందిన అల్లెసాండ్రో సెట్టె ఆఫ్‌ లా జొల్ల ఇన్‌స్టిట్యూట్‌ (ఎల్‌జేఐ) తెలిపింది. 

షేన్‌ క్రాటీ, డానియల వేస్కాఫ్‌తో కలిసి ఎల్‌జేఐ సర్వే చేసింది. మొత్తం 188 బాధితులపై సర్వే చేయగా వారి రక్త నమూనాల్లో ఇదే విషయం తెలిసిందని ఆ సంస్థ తమ జర్నల్‌లో ప్రచురించిన కథనంలో పేర్కొంది. యాంటీ బాడీస్‌ను వైరస్‌ కిల్‌ చేస్తుందని గుర్తించారు. బి సెల్స్‌, టీ సెల్స్‌ను నశింపజేస్తుందని తమ నివేదికలో పేర్కొన్నారు. నిరోధక శక్తిపై ప్రభావం చూపి ఇన్ఫెక‌్షన్స్‌ వచ్చే అవకాశం ఉందని ఆ సంస్థ ప్రతినిధి ఒకరు మీడియాకు చెప్పారు. 

సార్స్‌ వ్యాధి పొంచి ఉండే ప్రమాదం ఉందని, కొన్నాళ్లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. కరోనా నుంచి కోలుకున్న 60 శాతం మందిలో ఇన్ఫెక‌్షన్‌ సోకే ప్రమాదం 16.7 శాతం మందికి ఉందని, అది కూడా 65 రోజుల్లోపు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రీ ఇన్ఫెక‌్షన్‌ వచ్చే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని ఈ సర్వే ద్వారా వారు చెప్పాలనుకుంటున్నారు. 

మరిన్ని వార్తలు