నోబెల్‌ 2022: వైద్య రంగంలో బహుమతి ప్రకటన, విజేత ఎవరంటే..

3 Oct, 2022 15:38 IST|Sakshi

స్టాక్‌హోం: ప్రతిష్టాత్మకమైన నోబెల్‌ విజేతల ప్రకటన మొదలైంది. వైద్య రంగంలో.. జన్యు శాస్త్రవేత్త స్వాంటె పాబో(67)కు అవార్డును ప్రకటించింది నోబెల్‌ కమిటీ. నోబెల్‌ కమిటీ ఫర్‌ ఫిజియాలజీ(మెడిసిన్‌) సెక్రటరీ థామన్‌ పెర్ల్‌మాన్‌ సోమవారం స్వీడన్‌ రాజధాని స్టాక్‌హోంలోని కారోలిన్‌స్కా ఇనిస్టిట్యూట్‌లో జరిగిన సమావేశంలో విజేతను ప్రకటించారు.

స్వీడన్‌కు చెందిన స్వాంటె పాబోకు మెడిసిన్‌లో నోబెల్‌ బహుమతి దక్కినట్లు తెలిపారు. అంతరించిపోయిన హోమినిన్‌ల జన్యువులు, మానవ పరిణామానికి సంబంధించిన ఆయన ఆవిష్కరణలకుగానూ నోబెల్‌ ఇస్తున్నట్లు కమిటీ పేర్కొంది.


నోబెల్‌ విజేతను ప్రకటిస్తున్న థామన్‌ పెర్ల్‌మాన్‌

పాబో తన మార్గదర్శక పరిశోధన ద్వారా ‘‘అసాధ్యంగా అనిపించేదాన్ని’’ సాధించారు. ఇప్పటి మనుషులకు.. అంతరించిపోయిన బంధువైన నియాండర్తల్ జన్యువును క్రమం చేయడం,  డెనిసోవా అనే ఇంతకుముందు తెలియని హోమినిన్‌కు సంబంధించి సంచలనాత్మక ఆవిష్కరణను చేసిన పాబో.. 70వేల సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుండి వలస వచ్చిన తరువాత ఇప్పుడు అంతరించిపోయిన ఈ హోమినిన్‌ల నుంచి హోమో సేపియన్‌లకు జన్యు బదిలీ జరిగిందని కూడా కనుగొన్నారని నోబెల్‌ కమిటీ తెలిపింది. ఇదిలా ఉంటే..  ఉక్రెయిన్‌ యుద్ధ పరిణామాల నేపథ్యంలో.. ఈసారి నోబెల్‌ విజేతల ప్రకటన ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది.

మరిన్ని వార్తలు