టెస్లాకు థ్యాంక్యూ చెప్పిన వికలాంగుడు?

26 Mar, 2021 20:27 IST|Sakshi

రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న టెక్నాల‌జీ వల్ల ఒక‌ప్పుడు మ‌నం ఇబ్బంది ప‌డిన ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ప్రస్తుతం అభివృద్ధి చెందిన టెక్నాలజీ వల్ల కరోనా లాంటి విపత్కర సమయంలో కూడా ఆఫీస్ పనిని ఇంటి నుంచి చేయడం జరుగుతుంది. ఇలా ఎన్నో సమస్యలకు టెక్నాల‌జీ వల్ల పరిష్కారం లభిస్తుంది. ప్రస్తుతం పెద్ద పెద్ద పట్టణాల్లో ప్రతి మనిషికి ఒక కారు ఉంటుంది. దీనివల్ల వారు బయటకి వచ్చినప్పుడు ట్రాఫిక్ జామ్ లతో పాటు, కారు పార్కింగ్ సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. 

చైనా, జపాన్ లాంటి దేశాల్లో కార్ పార్కింగ్ కోసం వివిధ అంతస్థుల్లో కారు పార్కింగ్ చేసే పద్ధతి కూడా ఉంది. అయితే, ఈ కార్ల పార్కింగ్ వల్ల చాలా మంది ఎప్పుడో ఒకసారి ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు. ఇక కారు పార్కింగ్ విషయంలో వికలాంగులు పడ్డ ఇబ్బందుల గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ఒక వికలాంగుడు కూడా కారు పార్కింగ్ విషయంలో ఇటువంటి సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చింది. తాను తన కారు పార్క్ చేసిన ప్రదేశానికి వచ్చి కారు డోర్ తీయడానికి ప్రయతించినప్పుడు చాలా ఇబ్బందికి గురి అయ్యాడు. తన టెస్లా కారుకి ఇరువైపులా వేరే కార్లు పార్క్ చేసి ఉండటం వల్ల కారు డోర్ తీయడానికి సాధ్యం కాలేదు.

కారు యజమాని థామస్ ఫొగ్డో త‌న కారున్న ప‌రిస్థితిని గ‌మ‌నించి కాస్త వెన‌క్కి వ‌చ్చి జేబులో నుంచి త‌న స్మార్డ్ ఫోన్ తీసి టెస్లా యాప్ లో క్లిక్ చేయ‌గానే టెస్లా కారు వ‌చ్చి త‌న ముందు ఆగుతుంది. అంత మంచి సౌక‌ర్యాన్ని అందించిన టెస్లాకు ఫోగ్డో థాంక్యూ చెప్పాడు. ట్విట్ట‌ర్‌లో ఈ వీడియోను "థ్యాంక్యూ @టెస్లా హెల్ప్‌ఫుల్, కూల్ ఫీచర్ అందించినందుకు" అని పోస్టు చేసాడు. ఈ ఘటన 2019, సెప్టెంబర్ 8న జరిగింది. 44 సెకన్లు వీడియో క్లిప్‌ని 1.3 మిలియ‌న్ల కంటే ఎక్కువ మందే చూశారు. వేల కొద్దీ లైక్‌లు, రీట్వీట్‌లు, రిప్లైలు వ‌చ్చాయి. అయితే అన్నింటిలో మంచి చెడులు ఎలా ఉంటాయో, ఈ టెక్నాల‌జీలోనూ అంతే ఎంతో కొంత ఇబ్బంది ఉండ‌క‌పోదు. అందుకే ఈ వీడియోకి మిక్స్‌డ్ స్పంద‌న వ‌చ్చింది. కొంద‌రు అద్భుతంగా ఉందంటే, ఇంకొంద‌రు ఇలాగైతే కారును హ్యాక్ చేసేయొచ్చు, యాక్సిడెంట్లు త‌ప్ప‌వు అంటూ కామెంట్ చేశారు.

చదవండి:

వాహనదారులకు కేంద్రం తీపికబురు!

మరిన్ని వార్తలు