ఆవును హెలికాప్ట‌ర్‌లో ఇంటికి చేర్చిన రైతు

21 Aug, 2020 10:08 IST|Sakshi

స్విట్జ‌ర్లాండ్ : మ‌న దేశంలో ఆవును గోమాత‌గా పూజిస్తూ కుటుంబంలోని  వ్య‌క్తిలా చూస్తాం. ఆవుకు ఏమైనా అయితే విలవిల్లాడిపోతాం. తాజాగా ఇలాంటి ఘ‌ట‌నే స్విట్జ‌ర్లాండ్‌లోనూ చోటుచేసుకుంది. ఆవుకు గాయం కావ‌డంతో ఆ రైతు  త‌ట్టుకోలేక‌పోయాడు. దీంతో   విమానం తీసుకొచ్చి మ‌రీ ఆవును ఇంటికి త‌ర‌లించాడు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియ‌లో వైర‌ల్ అయ్యింది. వివ‌రాల ప్ర‌కారం..స్విట్జ‌ర్లాండ్ స్విస్‌ ఆల్ప్స్‌లోని ఓ పర్వతం వ‌ద్ద మేత‌కు వెళ్లిన ఆవు గాయ‌ప‌డింది.

నొప్పితో కుంటుతూ న‌డుస్తున్న దృశ్యం రైతు కంట ప‌డింది. దీంతో ఇంటిదాకా న‌డిస్తే మ‌ళ్లీ ఆవుకు నొప్పి ఎక్కువవుతుంది అనుకున్నాడు. వెంట‌నే హెలికాప్ట‌ర్ సాయం కోర‌గా  రెస్క్యూ టీమ్ వచ్చి ఆవుకి తాళ్లు కట్టి క్షేమంగా ఇంటికి చేర్చారు. దీనికి సంబంధించిన వీడియోను ఎవ‌రో తీసి ఓ న్యూస్‌ ఛాన‌ల్‌కి ట్యాగ్ చేయ‌గా అది కాస్తా వైర‌ల్ అయ్యింది. ల‌క్ష‌ల‌మంది ఈ వీడియోను  వీక్షించి రీట్వీట్లు చేస్తున్నారు. ఆవు మీద మీరు కురిపించిన ప్రేమ‌కు ముగ్ధుల‌మ‌య్యాం అంటూ ప‌లువురు నెటిజ‌న్లు రైతును పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్నారు. (వైరల్‌ : అందుకే అవంటే మాకు ప్రాణం! )


 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు