చైనాతో ఢీ అంటే ఢీ అంటున్న తైవాన్‌.. అసలేం జరుగుతోంది!

4 Dec, 2021 12:52 IST|Sakshi

చైనా ఆధిపత్యాన్ని తైవాన్‌ సవాల్‌ చేయాలనుకుంటోంది. ఇరు దేశాల మధ్య యుద్ధం కనుక వస్తే తనను తాను కాపాడుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగానే సబ్‌ మెరైన్‌ ప్రాజెక్టును చేపట్టింది. 2023 నాటికి ఈ సబ్‌మైరైన్‌ను సముద్ర జలాల్లో పరీక్షించాలన్న లక్ష్యంతో ముందడుగు వేస్తోంది. చైనా వైఖరితో సహనం నశించిన తైవాన్‌ 2015లోనే అమెరికా, జపాన్‌ దేశాల్లో కీలకమైన సబ్‌మెరైన్‌ టెక్నాలజీ సంస్థలతో ఒప్పందం చేసుకుంది.

గతేడాది సబ్‌మెరైన్ల తయారీని లాంఛనంగా ప్రారంభించింది. కాగా సబ్‌మెరైన్‌లో కీలక భాగాల తయారీ, పరీక్షలు విజయవంతమైనందునే కీల్‌ లేయింగ్‌ ఉత్సవాన్ని గత నెల నిర్వహించినట్లు తెలుస్తోంది. మొత్తం ఎనిమిది సబ్‌మెరైన్‌లు అందుబాటులోకి రానున్నాయని సమాచారం. మరోపక్క చైనా మాత్రం అడ్డగోలుగా నావికదళ బలాన్ని పెంచుకుంటోంది. దీంతో పట్టుదలగా ప్రయత్నించి తైవాన్‌ సొంతంగా సబ్‌మెరైన్ల తయారీని మొదలుపెట్టింది.

ఈ ప్రాజెక్టుకు బ్రిటన్‌, అమెరికా, కెనడాల్లోని సంస్థలు సాయం చేస్తున్నట్లు ఇంగ్లీష్‌ మీడియా కథనం. కాగా తైవాన్‌ వద్ద పురాతన సబ్‌ మెరైన్లు ఉన్నాయి. కానీ  చైనాతో యుద్దం జరిగితే కనుక అవి నిలువలేవు. దీంతో వాటిని తమ నేవీ శిక్షణ కోసం వినియోగిస్తోంది. ఇందుకు అమెరికా సైన్యం సహకరిస్తూ తమ కమాండోలతో శిక్షణ ఇస్తోంది. దీనికి తోడు సబ్‌మెరైన్ల తయారీకి అమెరికా, మిత్రదేశాలు సాయం చేస్తుండటం డ్రాగన్‌ను ఉకిరి బిక్కిరి చేస్తోంది.

చదవండి: Pakistan PM Imran Khan: ఇమ్రాన్‌ ఖాన్‌కు ఘోర అవమానం.. పరువు పాయే

మరిన్ని వార్తలు