సెలవు కోసం భార్యకు విడాకులిచ్చిన భర్త...అది కూడా 3 సార్లు

15 Apr, 2021 14:18 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

వివాహం అనగానే ఉద్యోగులకు సహజంగానే సెలవులు ఇస్తారు. అయితే అది ఎన్ని రోజులనేది మనం పని చేసే సంస్థని బట్టి ఉంటుంది. ఒక్కోసారి మనం ఉంటున్న దేశం, అక్కడ అనుసరిస్తున్న చట్టాలకు అనుగుణంగా కూడా సెలవులు ఇస్తారు. ఇప్పుడు ఇది ఎందుకు అంటారా.. ఓ ఘనుడు ఎక్కువ పెయిడ్ లీవ్‌లను పొందడం కోసం ఒకే మహిళను ఏకంగా నాలుగు సార్లు పెళ్లి చేసుకున్నాడు. చివరకు ఆ బ్యాంకుకు అతని నిర్వాకం తెలియడంతో లీవ్‌ పొడిగింపును నిరాకరించింది.

ఒకే మహిళను 4 సార్లు వివాహం 
తైవాన్‌ రాజధాని తాయ్‌పెయ్‌ నగరంలో ఓ బ్యాంక్‌లో క్లర్క్‌గా పనిచేస్తున్న వ్యక్తి సుమారు నెల రోజుల వ్యవధిలో ఒకే మహిళను 4 సార్లు పెళ్లి చేసుకున్నాడు. కేవలం తన సంస్థ నుంచి సెలవు పొడిగింపు కోసమే అతనీ పని చేశాడు. తైవాన్‌ కార్మిక చట్టం ప్రకారం ఏ ఉద్యోగికైనా పెళ్లికి 8 రోజుల సెలవు తప్పనిసరి. దీన్నే అడ్డంగా పెట్టుకుని ఈ పెళ్లి స్టంట్ చేశాడు. సంస్థ మంజూరు చేసిన సెలవుతో అతను సంతృప్తి చెందలేదు. ఎక్కువ రోజులు సెలవు కావాలనుకున్నాడు. దీంతో అతను తన భార్యకు విడాకులు ఇచ్చి మళ్లీ పెళ్లి కోసం సెలవు దరఖాస్తు చేశాడు. అలా అతను తన భార్యకు 3 సార్లు విడాకులు ఇచ్చి మళ్లీ ఆమెనే 4 సార్లు పెళ్లి చేసుకున్నాడు. అందుకుగాను మొత్తం 32 రోజుల కోసం లీవ్‌ అప్లై చేశాడు. అయితే అతను పనిచేస్తున్న బ్యాంక్ వారు ఈ విషయాన్ని పసిగట్టి అతనికి లీవ్‌ను పొడిగించేందుకు నిరాకరించారు. దీంతో సదరు వ్యక్తి కోర్టుకెక్కాడు. ఏదేమైనా ఈ క్లర్క్‌కు చట్టాన్ని వాడుకోవడం బాగానే తెలిసినట్టు ఉంది.

( చదవండి: ఈ వ్యక్తి పందెం కోసం ఏకంగా పాములతో...

మరిన్ని వార్తలు