తైవాన్‌లో పెరుగుతున్న టెన్షన్‌... ఉక్రెయిన్‌లా పోరు సాగించలేం

25 Aug, 2022 13:09 IST|Sakshi

Taiwan's previous government reduced compulsory service from one year: అమెరికా సభ ప్రతినిధుల స్పీకర్‌ నాన్సీ తైవాన్‌ పర్యటన ఎంతటి ఉద్రిక్తలకు దారితీసిందో తెలిసిందే. నాన్సీ పర్యటనతో చైనా యుద్ధానికి సై అంటూ వార్నింగ్‌లు ఇస్తూ.. తైవాన్‌ సరిహద్దు, జలసంధిలో పెద్ద ఎత్తున్న సైనిక కసరత్తులు, సైనిక విన్యాసాలు చేపట్టింది. ప్రపంచ దేశాలకు మరో యుద్ధం మొదలవుతుందేమో అన్నంత భయాన్ని కలిగించింది చైనా. సాక్షాత్తు అమెరికానే ఇది తమ వ్యక్తిగత సందర్శనని చెబుతున్నప్పటికీ చైనా శాంతించ లేదు.

పైగా అక్కడ తైవాన్‌ సరిహద్దుల వెంబడి తమ సైనికులను మోహరింపచేసి.... అన్ని పనులు పూర్తి చేశాం, ఏ క్షణమైన యుద్ధానికి రెడీ అంటూ పెద్ద బాంబు పేల్చింది. దీంతో తైవాన్‌లో సర్వత్ర భయాలు, ఆందోళనలు మొదలయ్యాయి. వాస్తవానికి ఎప్పటికైన చైనా తమ దేశంపై దండయాత్ర చేసి లాగేసుకుంటుందని భయపుడుతూనే ఉంది తైవాన్‌. కానీ ఇప్పుడూ చైనా తైవాన్‌ సరిహద్దుల్లో సాగిస్తున్న తాజా పరిణామాలతో ఆ భయాలు మరింత అధికమయ్యాయి. గతంలో తైవాన్‌ స్వచ్ఛంద దళాన్ని సృష్టించే లక్ష్యంతో ఒక ఏడాది నిర్బంధ సేవను అమలు చేసింది. కానీ ఇప్పుడు ఆ నిర్బంధ సేవను నాలుగు నెలలకు తగ్గించింది. వాస్తవానికి ఈ నాలుగు నెలల సమయం నిర్బంధ సైనిక శిక్షణకు సరిపోదు.

ఈ మేరకు ఒక హెన్నీ చెంగ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ ఏంజెంట్‌ మాట్లాడుతూ..తాను నాలుగు నెలల సైనిక శిక్షణ పూర్తి చేశాను కానీ ఎక్కువ కాలం రాత పనిలోనే గడిపినట్లు చెబుతున్నాడు. తమ పని యుద్ధం చేయడం కాబట్టి తుపాకి పట్టుకుని కాల్చడం నేర్పిస్తే సరిపోతుంది కానీ ఆ శిక్షణ ఇవ్వలేదని వాపోయాడు. అదీగాక ప్రస్తుతం తైవాన్‌లో సైనిక బలగం కూడా తక్కువగానే ఉంది. దీంతో తైవాన్‌ అధ్యక్షురాలు యంత్రాంగం త్సాయ్ ఇంగ్-వెన్ సైనిక సేవనను పునరుద్ధరించాలా లేదా అనేదానిపై తీవ్ర సందిగ్ధంలో ఉంది.

తైవాన్‌ నేషనల్‌ డిఫెన్స్‌ ప్రకారం సైనిక శిక్షణను పెంచడం తోపాటు జెట్‌ విమానాలు, యాంటీ షిప్‌ క్షిపణులు పెద్ద మొత్తంలో  ఇప్పటికే తైవాన్‌ కొనుగోలు చేసింది కానీ అవి ఏ మాత్రం సరిపోవని తేల్చి చెప్పింది. అదీగాక ఉక్రెయన్‌లా యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు తైవాన్‌ ప్రజలు సిద్ధంగా లేరని తైపీ రిటైర్డ్‌ ఆర్మీ కల్నల్‌ చెబుతున్నారు. అంతేకాదు రైఫిల్ పట్టుకోవడమే కాదు, శిక్షణ ద్వారా సముహంగా యుద్ధ పరిస్థితులను ఎలా నిర్వహించాలో నేర్చుకోవాలి అప్పుడే వారికి భవిష్యత్తులో ప్రతిఘటించాలనే ఆశ ఉంటుందన్నారు. ఏది ఏదీమైన చైనా తైవాన్‌ని తీవ్ర భయాందోళనలు గురిచేసి సంకటస్థితిలోకి నెట్టేసింది, ఏ క్షణం ఏం జరుగుతుందో తెలయడం లేదని తైవాన్‌ ఆర్మీ ఆవేదనగా పేర్కొంది.

(చదవండి:

మరిన్ని వార్తలు