కాబుల్‌ వైపు దూసుకొస్తున్న తాలిబన్‌ సైన్యం.. 15 కిలో మీటర్ల దూరంలో

14 Aug, 2021 18:49 IST|Sakshi

కాబుల్‌: అఫ్ఘనిస్తాన్‌లో పలు ప్రాంతాలను తాలిబన్లు తమ ఆధీనంలోని తెచ్చుకుంటున్నాయి. అందులో భాగంగా తాలిబన్ సైన్యం దేశ రాజధాని కాబుల్‌ వైపు దూసుకువెళ్తోంది. కాబుల్‌కు దక్షిణాన ఉన్న నగరాన్ని తాలిబన్ల స్వాధీనం చేసుకున్నాయి. ఈ క్రమంలో ఆమెరికా బలగాలు రాయబార కార్యాలయాన్ని, ఇతర పౌరులను ఖాళీ చేయటంలో సహాయ పడుతున్నాయి. కాబుల్‌కు సమీపంలోని మైదాన్ వార్దక్‌ ప్రావిన్స్‌ రాజధాని మైదాన్‌ షార్‌ పట్టనాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకోవటంతో రాజధాని వైపు దూసుకోస్తున్నారు. ప్రస్తుతం కాబుల్‌కు 15 కీలో మీటర్ల దూరంలో తాలిబన్ బలగాలు ఉన్నట్లు తెలుస్తోంది.

అమెరికా తుది విడత బలగాలను ఉపసంహరించడానికి వారంముందే దేశంలో 66% భూభాగం తాలిబన్ల నియంత్రణలోకి వెళ్లిపోయింది. ఇప్పటికే దేశంలో రెండో అతిపెద్ద నగరమైన కాందహార్‌ను ఆక్రమించుకున్నారు. దక్షిణాది ఆర్థిక హబ్‌గా పేరున్న కాందహార్‌లో గురువారం రాత్రి తాలిబన్లు, అఫ్ఘనిస్తాన్ సైన్యానికి మధ్య భీకర ఘర్షణ జరిగింది. అర్ధరాత్రి దాటాక తాలిబన్లు కాందహార్‌ని స్వాధీన పరచుకొని ప్రభుత్వ కార్యాలయాలపై తాలిబన్‌ జెండాలు ఎగురవేసినట్టు  అధికారులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు