Talibans: తాలిబన్ల మరో దుశ‍్చర్య : ఫోటో విడుదల 

30 Aug, 2021 14:00 IST|Sakshi

 మతగురువు మౌల్వీ మొహమ్మద్ సర్దార్ జాద్రాన్ అరెస్ట్ చేసిన తాలిబన్లు

ఫోటో విడుదల

కాబూల్: అఫ్గానిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు మరో దుశ్చర్యు పాల్పడ్డారు. ప్రముఖ మతగురువు మౌల్వీ మొహమ్మద్ సర్దార్ జాద్రాన్‌ను తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. ఈ మేరకు  వారు ఒక ఫోటోను విడుదల చేశారు.

చదవండి: Taliban: భారత్‌తో సంబంధాలు, తొలిసారి స్పందించిన అగ్రనేత

అఫ్గాన్‌ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రిలీజియస్ స్కాలర్స్ మాజీ అధిపతి మౌల్వీ మొహమ్మద్ సర్దార్ జాద్రాన్‌ను అరెస్టు చేశామని తాలిబన్లు సోమవారం ధ్రువీకరించారు మొహమ్మద్ మౌల్వీ కళ్లకు గంతలు కట్టి ఉన్న సర్దార్ జద్రాన్ ఫొటోను తాలిబన్లు  విడుదల చేశారు. కాగా ఇప్పటికే జానపద గాయకుడిని హత్య చేసిన సంగతి తెలిసిందే. అలాగే గతంలో తొలి మహిళా గవర్నర్‌లలో ఒకరైన సలీమా మజారీని తాలిబన్లు అదుపులోకి తీసుకున్నారు. 

చదవండి: Taliban-Afghanistan: జానపద గాయకుడిని కాల్చి చంపిన తాలిబన్లు

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు