Taliban Chief: పాక్‌ కస్టడీలో తాలిబన్‌ చీఫ్‌!

21 Aug, 2021 07:44 IST|Sakshi

Taliban Chief: అఫ్గానిస్తాన్‌ తాలిబన్ల వశమైనప్పట్నుంచి తాలిబన్‌ సుప్రీం కమాండర్‌ హైబతుల్లా అఖుంద్‌జాదా ఎక్కడ అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆయన నుంచి ఎలాంటి సందేశం రాలేదు. హైబతుల్లా ప్రస్తుతం పాకిస్తాన్‌ ఆర్మీ కస్టడీలో ఉన్నారని అంతర్జాతీయ నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత ఆరు నెలల కాలంలో తాలిబన్‌ ముఖ్య నేతలెవరూ తెరపైకి రాలేదు. సాధారణగా తాలిబన్‌ అగ్రనాయకులు రహస్య ప్రాంతాల్లో ఉంటూ తెర వెనుక నుంచి మంత్రాంగం నడిపిస్తూ ఉంటారు. చదవండి: భారత ఎంబసీల్లో సోదాలు

హైబతుల్లా మేలో రంజాన్‌ సందర్భంగా శుభాకాంక్షల వీడియోని విడుదల చేశారు. ఆ తర్వాత ఆయన దగ్గర నుంచి ఎలాంటి సందేశమూ రాలేదు. 2016 మేలో అప్పటి తాలిబన్‌ నాయకుడు అక్తర్‌ మన్సూర్‌ అమెరికా మిలటరీ డ్రోన్ల దాడుల్లో హతం కావడంతో హైబతుల్లా సుప్రీం కమాండర్‌గా నియమితులయ్యారు. మన్సూర్‌ ముఖ్య అనుచరుల్లో హైబతుల్లాని చీఫ్‌ని చేసినట్టుగా అప్పట్లో తాలిబన్లు వీడియో విడుదల చేశారు. 50 ఏళ్లకు పైనే వయసున్న హైబతుల్లా ఒక సైనికుడిగా కంటే స్కాలర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అఫ్గాన్‌ తాలిబన్ల వశమైతే ఆయనే పగ్గాలు చేపడతారన్న వార్తలు వచ్చాయి.  చదవండి: మిమ్మల్ని ఇంటికి తీసుకొస్తాం: జో బైడెన్‌

మరిన్ని వార్తలు