Taliban Afghanistan: నేను చనిపోలేదు.. బతికే ఉన్నా: తాలిబన్‌ సహ వ్యవస్థాపకుడు

14 Sep, 2021 08:24 IST|Sakshi

కాబూల్‌: తాలిబన్ల మధ్య అంతర్గతంగా జరిగిన ఘర్షణలో తాను చనిపోయినట్లు సోషల్‌ మీడియాలో విస్తృతంగా సాగుతున్న ప్రచారాన్ని తాలిబన్‌ ముఠా సహ వ్యవస్థాపకుడు, అఫ్గానిస్తాన్‌ ఉప ప్రధానమంత్రి అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ ఖండించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ఆడియో ప్రకటన విడుదల చేశారు. తాలిబన్ల అధికారిక వెబ్‌సైట్లలో ఈ ఆడియోను పోస్టు చేశారు. తనకు ఏమీ కాలేదని, ప్రస్తుతం క్షేమంగా ఉన్నానని స్పష్టం చేశారు.

మీడియాలో తప్పుడు వార్తలు ప్రసారం చేయడం దారుణమని విమర్శించారు. పుకార్లు సృష్టించడం మానుకోవా లని హితవు పలికారు. అఫ్గాన్‌ను ఆక్రమించుకున్న తర్వాత అధికారాన్ని పంచుకొనే విషయంలో ప్రెసిడెన్షియల్‌ ప్యాలెస్‌లో తాలిబన్ల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగిందని, కాల్పులు చోటుచేసుకున్నాయని, ఈ ఘటన లో బరాదర్‌ హతమయ్యాడని సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.   

చదవండి: మరణించాడని భావిస్తే.. మళ్లీ ప్రత్యక్షమయ్యాడు..

మరిన్ని వార్తలు