నలుగురు మహిళల దారుణ హత్య.. ప్రకటించిన తాలిబన్లు

6 Nov, 2021 19:19 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఉత్తర అఫ్గనిస్తాన్‌లో చోటు చేసుకున్న దారుణం

నలుగురు హక్కుల కార్యకర్తలే కావడం గమనార్హం

కాబూల్‌: తాలిబన్లు ఆక్రమించిన నాటి నుంచి అఫ్గనిస్తాన్‌లో అరాచకాలు.. ముఖ్యంగా మహిళలపై దారుణాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా అఫ్గన్‌ ఉత్తర నగరమైన మజర్‌ ఈ షరిఫ్‌లో నలుగురు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. ఈ వార్తను అఫ్గన్‌ తాలిబన్‌ అధికార ప్రతినిధి ప్రకటించారు. ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌ చేశామని తెలిపారు. ఆ వివరాలు..

తాలిబన్లు అఫ్గనిస్తాన్‌ను ఆక్రమించిన నాటి నుంచి ఆ దేశ ప్రజలు.. ముఖ్యంగా మహిళలు  విదేశాలకు వెళ్లిపోవాలని ప్రయత్నిస్తున్నారు. చనిపోయిన నలుగురు మహిళలు కూడా ఈ ప్రయత్నంలోనే ఉన్నారు. వీరు నలుగురు స్నేహితులే కాక.. కోలిగ్స్‌ కూడా. వీరు దేశం విడిచి వెళ్లిపోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఏజెంట్‌ ద్వారా ఆ ప్రయత్నాలు చేస్తున్నారు.  
(చదవండి: తాలిబన్ల దుశ్చర్య.. 13 మంది ఊచకోత)

ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం వీరికి ఓ వ్యక్తి నుంచి ఫోన్‌ వచ్చింది. ఏజెంట్‌ అని భావించిన మహిళలు అతడితో మాట్లాడారు. ఇంటికి రావాల్సిందిగా ఆహ్వానించడంతో అతడితో పాటు కారులో వెళ్లారు. ఇంటికి తీసుకెళ్లిన వ్యక్తి వారిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. చనిపోయిన నలుగురు కూడా హక్కుల కార్యకర్తలని సమాచారం. అయితే దీని గురించి మాట్లాడటానికి వారి కుటుంబ సభ్యులు నిరాకరించారు. 

చదవండి: తెరపైకి తాలిబన్ల సరికొత్త రూల్‌.. ఈ సారి ఏకంగా..

మరిన్ని వార్తలు