భారత్‌తో సత్సంబంధాలను కోరుకుంటున్నాం: తాలిబన్‌ ప్రతినిధి

28 Aug, 2021 15:23 IST|Sakshi

ఇస్లామాబాద్‌: భారత్‌ సహా అన్ని దేశాలతోనూ తాము సత్సంబంధాలను కోరుకుంటున్నా మని అఫ్గానిస్తాన్‌లో అధికారం చేజిక్కించుకున్న తాలిబన్ల ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్‌ తెలిపారు. వేరే దేశానికి వ్యతిరేకంగా తమ భూభాగాన్ని వాడుకునేందుకు అనుతించబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు పాకిస్తాన్‌కు చెందిన ఏఆర్‌వై వార్తా చానెల్‌ ఒక కథనం ప్రసారం చేసింది. ‘ఈ ప్రాంతంలోని ఎంతో ముఖ్యమైన భారత్‌ సహా అన్ని దేశాలతోనూ మంచి సంబంధాలు కలిగి ఉండాలని ఆశిస్తున్నాం.

అఫ్గాన్‌ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, భారత్‌ తన విధానాలకు రూపకల్పన చేయాలని కోరుకుంటున్నాం’అని తెలిపారు. అఫ్గానిస్తాన్‌లో ఐసిస్‌–కె, తెహ్రిక్‌ ఇ తాలిబన్‌ వంటి సంస్థలు బలపడటంపై ఆయన స్పందిస్తూ..‘మా భూభాగాన్ని వేరే దేశానికి వ్యతిరేకంగా వాడుకునేందుకు అనుమతించబోం. ఇదే విషయాన్ని గతంలోనూ స్పష్టం చేశాం’అని వివరించారు.  
చదవండి: టార్గెట్‌ ఐసిస్‌: అమెరికా వేట మొదలైంది

మరిన్ని వార్తలు