పాక్‌ వ్యతిరేక నినాదాలు.. కాల్పులు జరిపిన తాలిబన్లు

7 Sep, 2021 17:59 IST|Sakshi

కాబూల్‌: తాలిబన్ల ఆక్రమణ నాటి నుంచి అఫ్గనిస్తాన్‌ రాజధాని కాబూల్‌లో హై టెన్షన్‌ నెలకొంది. తాలిబన్లకు పాకిస్తాన్‌ సహకరిస్తోందని అఫ్గనిస్తాన్‌ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పాక్‌ తీరుకు నిరసనగా పలువురు అఫ్గన్‌ వాసులు పాక్‌ ఎంబసీ వద్ద ఆందోళనలకు దిగారు. వీరిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. వీరంతా పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయసాగారు. అఫ్గన్‌ వాసుల చర్యల పట్ల తాలిబన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని చెదరగొట్టేందకు కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. (చదవండి: పాక్‌ సహా ఏ దేశ జోక్యాన్ని సహించం: తాలిబన్లు)

కాబూల్‌లోని పాకిస్తాన్‌ ఎంబసీ ఎదురుగా స్థానికుల ఆందోళనకు దిగారు. అఫ్గనిస్తాన్‌ వ్యవహారాల్లో పాకిస్తాన్ జోక్యంపై ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనల్లో భారీ ఎత్తున మహిళలు పాల్గొన్నారు. పాకిస్తాన్‌ వ్యతిరేక నినాదాలతో ఎంబసీ ప్రాంతం హోరెత్తిపోయింది. అయితే నిరసనలను జీర్ణించుకోలేక పోయిన తాలిబన్లు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఆందోళనకారులపై కాల్పులు జరిపారు. నిరసనకారులు పరుగులు పెట్టారు. తాలిబన్ల తాజా చర్యలతో వారి వైఖరి ఏ మాత్రం మారలేదని.. హింసే వారి ఆయుధమని.. శాంతి మంత్రం వారికి రుచించదని మరోసారి రుజువుయ్యింది. 
చదవండి: తాలిబన్ల సంబరాలు.. 17 మంది పౌరులు మృతి!

మరిన్ని వార్తలు