Afghanistan:ప్రపంచంలోని అతిపెద్ద లిథియం నిక్షేపం తాలిబన్ల చేతుల్లోకి!

17 Aug, 2021 16:17 IST|Sakshi

కాబూల్‌: కాబూల్‌లోకి ప్రవేశించిన తాలిబన్లు అఫ్గానిస్తాన్‌ను పూర్తిగా హస్తగతం చేసుకోవడమేకాదు  ప్రపంచ ఇంధన ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఖనిజాల భారీ నిక్షేపాల ప్రాప్యతను నియంత్రించే సామర్థ్యాన్ని కూడా సొంతం చేసుకున్నారు. సంఘర్షణ, అవినీతి, అధికార లోపం కారణంగా గత పదేళ్లుగా దాదాపు పూర్తిగా ఉపయోగంలోకి రాకుండా ఉన్న లిథీయం నిక్షేపాలపై కూడా పట్టు సాధించారు. 

ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి బ్యాటరీలకు ఉపయోగపడే ఈ ఖనిజ వనరులు విరివిగా ఉపయోగంలోకి వస్తాయా, ఈ ఖనిజాల మైనింగ్‌ ట్రేడింగ్‌ను తాలిబన్లు సమర్ధవంతంగా నిర్వహించగలరా? ఖనిజాలు, విలువైన లోహాల నిధిగా పేరొందిన దేశంలో నల్లమందుకు ప్రత్యామ్నాయంగా  ప్రధాన ఆర్థిక వనరుగా మైనింగ్‌ను ఉపయోగించుకుంటారా? అనేది చర్చనీయాంశంగా మారింది. అమెరికన్ జియాలజిస్టులు దేశంలోని విస్తారంగా ఉన్న ఖనిజ సంపదను కనుగొన్న తరువాత  2010లో "సౌదీ అరేబియా ఆఫ్ లిథియం" గా పిలిచిన లిథియం ఖనిజ సంపదపై కూడా తాలిబన్లు తాజాగా పట్టు సాధించారు. దీని విలువ కనీసం 1 ట్రిలియన్ డాలర్లుగా ఉంటుందని అప్పట్లోనే అంచనా వేశారు. (Ashraf Ghani: భారీ నగదుతో పారిపోయాడు: రష్యా)

ఎలక్ట్రిక్ వాహనాల పునరుత్పాదక శక్తి బ్యాటరీలకు ఈ సిల్వర్ మెటల్ ఎంతో అవసరం ఉంది. అయితే ప్రపంచంలోని అగ్రశ్రేణి లిథియం ఉత్పత్తిదారు అయిన చైనా నుండి అమెరికా తన ఇంధన సరఫరా గొలుసులను విడదీయాలని చూస్తున్నందున, అప్గనిస్తాన్ ఖనిజ సంపద తాలిబాన్ నియంత్రణలోకి పోవడం అంటే అమెరికా ఆర్థిక ప్రయోజనాలకు దెబ్బేనని నిపుణుల అంచనా. తాలిబాన్లు ఇప్పుడు ప్రపంచంలోని కొన్ని ముఖ్యమైన వ్యూహాత్మక ఖనిజాలపై పట్టు సాధించారని వాషింగ్టన్‌ థింక్‌ ట్యాంక్, సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ రిస్క్‌లో పర్యావరణ భద్రతా కార్యక్రమం అధిపతి రాడ్ స్కూనోవర్ అన్నారు.  అయితే తాలిబన్లు వీటిని ఉపయోగించగలరా, ఉపయోగించుకుంటారా అనేది ముఖ్యమైన ప్రశ్న అన్నారు.

తాలిబన్లు అఫ్గన్‌ను అక్రమించుకున్న తరువాత దేశం విడిచిపారిపోయిన అధ్యక్షుడు, ప్రపంచ ఆర్థికవేత్త  అశ్రఫ్ ఘనీ ఖనిజాలను ఒక శాపంగా పేర్కొనేవారు. ఖనిజాలు అప్గన్‌కు రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటివి. అంతర్జాతీయ  పవర్‌ సంస్థ ప్రకారం, లిథియం కోసం గ్లోబల్ డిమాండ్. 2020  నాటితో పోలిస్తే 2040 నాటికి 40 రెట్లు పెరగనుంది.  ఈ ఖనిజాలు ప్రపంచవ్యాప్తంగా తక్కువగా లభ్యమవుతున్న నేపథ్యంలో అప్గనిస్తాన్‌కు గణనీయమైన  ఆదాయం లభించే అవకాశం ఉంది. అలాగే  గతంలో అఫ్గన్‌  ప్రభుత్వ అధికారులు దేశంలో అమెరికా సైనిక ఉనికిని విస్తరించేందుకు ప్రలోభ పెట్టి మరీ కొన్ని మైనింగ్ ఒప్పందాలకు ప్రయత్నించినాప్పటికీ వాటిని అడ్డుకున్నారు. అదే సమయంలో, తాలిబాన్లు తిరుగుబాటులో భాగంగా దేశ వార్షిక ఆదాయంలో 300 మిలియన్ డాలర్ల మేర అక్కడి ఖనిజాలను లాపిస్ లాజులి, రత్నం చట్టవిరుద్ధంగా దోచుకున్నారు. ఖనిజ నిక్షేపాలు ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో అవినీతి హింసను పెంచుతుందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు.  (Afghanistan crisis: గుండె బద్దలవుతోంది: బాలీవుడ్‌ హీరోయిన్‌)

( లిథియం...ఫైల్‌ ఫోటో)

తాలిబన్ నియంత్రణలోఇప్పుడు ఏమి జరుగుతుంది అనేది ప్రధాన చర్చ. అయితే  గ్లోబల్ లిథియం ట్రేడ్‌లోకి తాలిబన్లు ఎంట్రీ ఇవ్వలేరని స్కూనోవర్ చెప్పారు. అనేక సంవత్సరాల సంఘర్షణతో దేశంలోని భౌతిక మౌలిక సదుపాయాలు-రోడ్లు, విద్యుత్ ప్లాంట్లు, రైల్వేలు విధ్వంస మయ్యాయి. ఈ నేపథ్యంలో స్వాధీనం చేసుకున్న నగరాల్లో ప్రాథమిక ప్రజా సేవలు, కనీస మౌలిక సదుపాయాల కల్పనకే కష్టపడాలన్నారు.

అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షించే ఆర్థిక విధానాలను అమలు చేయడం. అంతర్జాతీయ పెట్టుబడి దారులను  ఆకర్షించే ఆర్థిక విధానాలు అమల్లో లేవు. తాలిబన్లతో పోటీపడుతున్న ఏ కంపెనీ అయినా మైనింగ్ ఒప్పందాల గురించి చర్చించడం కష్టమే. ఇక ఆన్‌లైన్‌లో మైనింగ్ కార్యకలాపాలకు అవసరమైన మౌలిక సదుపాయాలకు రుణ స్థాయిని చైనా గ్రూపునకు విస్తరించే అవకాశం ఇప్పట్లో లేదని డెవలప్ మెంట్ ఎకనామిక్స్ రీసెర్చర్ నిక్ క్రాఫోర్డ్ అభిప్రాయ పడ్డారు. అలాగే 2007లో అఫ్గనిస్తాన్‌లో ప్రారంభమైన 3 బిలియన్ డాలర్ల రాగి మైనింగ్ ప్రాజెక్ట్‌లో చైనా పెట్టుబడిదారులు తీవ్రంగా నష్టపోయిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ సందర్భంలో, నీటి కొరత, వాయు కాలుష్యం, వాతావరణ మార్పులకు సంబంధించిన తీవ్రమైన వాతావరణ విపత్తులతో సహా ఇప్పటికే అఫ్గన్‌ ప్రజలు ఎదుర్కొంటున్న ఇతర పర్యావరణ ప్రమాదాలకు మైనింగ్  కూడా తోడయ్యే అవకాశం ఉందని క్రాఫోర్డ్  చెప్పుకొచ్చారు.

మరిన్ని వార్తలు