Afghanistan: తాలిబన్ల రాజ్యం.. రంగంలోకి అమెరికా, జర్మనీ దళాలు

23 Aug, 2021 13:20 IST|Sakshi

కాబూల్‌: అఫ్గానిస్తాన్‌ రాజధాని కాబూల్ ఎయిర్‌పోర్ట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అఫ్ఘాన్ భద్రతా సిబ్బందిపై తాలిబన్లు కాల్పులకు తెగపడ్డారు. కాల్పుల్లో అఫ్ఘాన్ భద్రతా అధికారి మృతి చెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక అఫ్గాన్‌లో పరిస్థితులను అదుపులోకి తేవడానికి అమెరికా, జర్మనీ మిలటరీ దళాలు  రంగంలోకి దిగినట్లు సమాచారం.

చదవండి: Afghanistan: తాలిబన్లకు ముళ్లబాటే

కాగా అమెరికా దళాల ఉపసంహరణను ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్‌ సమర్ధించుకున్నారు. తాలిబన్లు దాడులకు తెగబడకుండా అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు. తాలిబన్ల వ్యవహారశైలి ఆధారంగా నిధులు మంజూరు ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులు ఎవరినీ నమ్మేలా లేవని జో బైడెన్‌ అన్నారు.

చదవండి: చక్కెర ఎగుమతులపై తాలిబన్‌ ఎఫెక్ట్‌ ?

మరిన్ని వార్తలు