ట్యాక్సీల్లో వాళ్లను తప్ప ఇంకెవ్వరని ఎక్కించుకుని తీసుకురావద్దు!

7 Nov, 2021 19:38 IST|Sakshi

నంగర్హర్: అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక అక్కడ రోజుకో ఆంక్ష అన్నట్లే ఉంది. ఇప్పటికే ప్రజలపై ఎన్నో ఆంక్షలు విధించిన తాలిబన్‌ ప్రభుత్వం.. తాజాగా ట్యాక్సీ డ్రైవర్లకు పలు ఆంక్షలు విధించింది. ట్యాక్సీల్లో ముష్కరులను ఎవరినైనా తీసుకొస్తే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించింది. తూర్పు నంగర్‌హార్ ప్రావిన్స్‌కు చెందిన ట్యాక్సీ డ్రైవర్లను తాలిబాన్ అనుబంధ సంస్థలకు సంబంధించిన వారిని మినహాయించి ఇతర ముష్కరులను ఎవ్వరిని మీరు ట్యాక్సిల్లో ఎక్కించుకోని తీసుకురావద్దని ఆదేశించినట్లు స్థానిక మీడియా పేర్కొంది.

(చదవండి: విచిత్రమైన వంటకం...అదే ఏం పకోడి రా బాబు!)

ఆ ప్రావిన్స్‌కు చెందిన ట్యాక్సీ డ్రైవర్ల అందుకు అంగీకరించినట్లు వెల్లడించింది. అదే సమయంలో టాక్సీలలో ఎవరైనా అనుమానాస్పద గన్‌మెన్‌లను చూసినప్పుడు అధికారులకు తెలియజేయాలని ప్రజలకు తాలిబన్లు ఆదేశించినట్లు తెలిపింది. ఈ మేరకు ఆఫ్ఘనిస్తాన్‌లోని తూర్పు ప్రావిన్సులలో మోహరిస్తున్న ఐఎస్‌ఐఎస్‌-కే ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని తాలిబన్లు ఇలాంటి ఆదేశాలు జారిచేసిందని స్థానిక మీడియా సంస్థ వెల్లడించింది.

(చదవండి: ‘ప్రవేశం లేదు’ బోర్డు.. ఎలుగుబంటి ఏం చేసిందో చూడండి!)

మరిన్ని వార్తలు