తాలిబన్ల అరాచకం.. అఫ్గన్‌ మాజీ ఉపాధ్యక్షుడి సోదరుడి హత్య

10 Sep, 2021 19:02 IST|Sakshi
తాలిబన్ల చేతిలో హత్యకు గురైన అఫ్గన్‌ మాజీ ఉపాధ్యక్షుడైనా అమ్రుల్లా సాలెహ్‌ తమ్ముడు రోహుల్లా సాలెహ్‌ (ఫోటో కర్టెసీ: ఇండియాటుడే)

అమ్రుల్లా సాలెహ్‌ సోదరుడిని హత్య చేసిన తాలిబన్లు

కాబూల్‌: అఫ్గనిస్తాన్‌ను ఆక్రమించిన తాలిబన్లు.. విధ్వంసకాండను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా తాలిబన్లు తాము అఫ్గనిస్తాన్‌ మాజీ ఉపాధ్యక్షుడైన అమ్రుల్లా సాలెహ్‌ తమ్ముడు రోహుల్లా సాలెహ్‌ని హత్య చేసినట్లు ప్రకటించుకున్నారు. దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. తాలిబన్లు పంజ్‌షీర్‌లో రోహుల్లా సాలెహ్‌ను హింసించి చంపినట్లు సమాచారం. ఈ దాడిలో తాలిబన్లు కూడా పెద్ద సంఖ్యలో మరణించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. రోహుల్లా సాలెహ్‌ మృతి అనంతరం తాలిబన్లు అతడి లైబ్రరీని ఆక్రమించారని సమాచారం. గ్రంథాలయంలోకి ప్రవేశించిన చిత్రాలను తాలిబన్లు విడుదల చేశారు. 
(చదవండి: కొత్త కోణం: అఫ్గాన్‌ సింహాలు తలవంచేనా!)

మూడు రోజుల క్రితం తాలిబన్లు తాము అఫ్గనిస్తాన్‌లో ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ పంజ్‌షీర్‌ నాయకులు తాలిబన్ల ప్రభుత్వాన్ని ఆమోదించలేదు. ఈ క్రమంలో పంజ్‌షీర్‌ ప్రాంత నాయకులు, మాజీ అఫ్గన్‌ పాలకులు ఉగ్రవాద అఫ్గన్ ప్రభుత్వాన్ని గుర్తించడానికి తొందరపడవద్దని తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌తో సహా అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. తాలిబన్లు ఏర్పాటు చేసిన కేబినెట్‌లో హిట్‌లిస్ట్‌లో ఉన్న ఉగ్రవాదులు ఉన్నారని తెలిపారు. 
(చదవండి: తిరిగి రండి.. మీకు పూర్తి రక్షణ కల్పిస్తాం: అఫ్గన్‌ ప్రధాని)

తాలిబన్ల ఆక్రమణ ప్రాంరంభం అయిన నాటి నుంచి పంజ్‌షీర్‌ లోయలో అహ్మద్ మసూద్ నేతృత్వంలోని నేషనల్ రెసిస్టెన్స్ ఫోర్స్ దళాలకు, తాలిబన్లకు మధ్య మొదలైన భీకరపోరు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం.

చదవండి: పాక్‌ కనుసన్నల్లో...

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు