అత‌నికి ల‌క్ ల‌క్క‌లా అతుక్కుంది

4 Aug, 2020 16:51 IST|Sakshi

టాంజానియా: రెండు అరుదైన రాళ్ల‌తో రాత్రికి రాత్రే కోటీశ్వ‌రుడైపోయిన టాంజానియా వ్య‌క్తి సనెన్యూ లైజ‌ర్‌ గురించి మీకు తెలిసే ఉంటుంది. గ‌నులు త‌వ్వే ప‌ని చేసుకుంటూ పొట్ట పోషించుకునే అత‌నికి ఓ రోజు రెండు పెద్ద రత్నాలు దొరిక‌డంతో కోటీశ్వ‌రుడిగా మారిపోయాడు. తాజాగా ఆయ‌న‌కు మ‌రోసారి ర‌త్నం దొరికింది. మ‌న్యారాలోని టాంజానియా గ‌నుల్లో ల‌భ్య‌మైన ఈ ర‌త్నం 6.3 కిలోల బ‌రువు తూగింది. దీని విలువ 4.7 బిలియ‌న్ టాంజానియా షిల్లాంగ్స్‌(రెండు మిలియ‌న్ డాల‌ర్లు)గా ఉంది. (రెండు రత్నాలతో కోటీశ్వరుడయ్యాడు)

లైజ‌ర్‌కు తొలిసారిగా జూన్‌లో ఈ అరుదైన ర‌త్నాలు రెండు దొర‌క‌గా వాటిని ప్ర‌భుత్వానికి విక్ర‌యించాడు. దీంతో సుమారు 25 కోట్ల వ‌ర‌కు సంపాదించి ఒక్కరోజులో ధ‌న‌వంతుడయ్యాడు. వీటినే ఆ దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు గుర్తించిన అతిపెద్ద టాంజానిట్ ర‌త్నాల‌ని స్వ‌యంగా ఆ దేశ గ‌నుల మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే డ‌బ్బులు సంపాదించిన త‌ర్వాత త‌న జీవితంలో ఎలాంటి ఆర్భాటాల‌కు పోలేద‌ని లైజ‌ర్ వెల్ల‌డించాడు. ఎప్ప‌టిలాగే త‌న 2 వేల ఆవుల‌ను పెంచుకుంటున్నాన‌ని చెప్పుకొచ్చాడు. ప్ర‌స్తుతం ఈ డ‌బ్బుతో ఓ పాఠ‌శాల‌ను క‌ట్టిస్తానంటున్నాడు. ఇత‌నికి న‌లుగురు భార్య‌లు, ముప్పై మంది పిల్ల‌లు ఉన్నారు. కాగా ఈ భూమి మీదే అరుదైన‌విగా టాంజానైట్ ర‌త్నాలు గుర్తింపు పొందాయి. ఇవి ఆకుప‌చ్చ‌, ఎరుపు, నీలం, ప‌ర్పుల్ రంగుల్లో ల‌భ్య‌మ‌వుతాయి. అయితే రానున్న 20 ఏళ్ల‌లో ఇవి అంత‌రించిపోనున్నాయ‌ని అక్క‌డి స్థానిక భూగోళ‌వేత్త అంచ‌నా వేస్తున్నారు. (ముగ్గురు డాన్స్‌.. కానీ ఒక్కరే!)

మరిన్ని వార్తలు