వ్యాక్సిన్ కోసం టాటా, మోడరానా ఇంక్‌ జట్టు

25 Jan, 2021 17:52 IST|Sakshi

ముంబై: టాటా గ్రూప్ యొక్క హెల్త్‌కేర్ వెంచర్ మోడరానా ఇంక్‌తో కలిసి కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను భారతదేశంలో తీసుకురావడానికి భాగస్వామ్యం కోసం చర్చలు ప్రారంభించినట్లు ఎకనామిక్ టైమ్స్ నేడు తెలిపింది. టాటా మెడికల్ & డయాగ్నోస్టిక్స్, మోడరనా యొక్క వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి భారతదేశ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ తో జతకట్టిన్నట్లు కొందరు అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై మోడెర్నా, టాటా మెడికల్ & డయాగ్నోస్టిక్స్ స్పందించలేదు.(చదవండి: వ్యాక్సిన్‌ రేస్‌లో టాప్‌టెన్‌లో‌ భారత్‌)

ఫైజర్ వ్యాక్సిన్ ను మైనస్ 70 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద భద్రపరచాలి. కానీ మోడెర్నాను సాధారణ ఫ్రిజ్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయవచ్చు. ఇది భారతదేశం వంటి పేద దేశాలకు మరింత అనుకూలంగా ఉంటుంది వారు పేర్కొన్నారు. మోడరనా యొక్క వ్యాక్సిన్ చివరి పరీక్ష దశలో 94.1శాతం మందికి ఎలాంటి తీవ్రమైన భద్రతా సమస్యలు తలెత్తలేదు. ఈ వ్యాక్సిన్ ఈ నెల ప్రారంభంలో యునైటెడ్ స్టేట్స్, ఐరోపాలో ఉపయోగించడానికి ఆమోదించబడింది అని మోడరనా సంస్థ పేర్కొంది. ప్రపంచంలోని అతిపెద్ద టీకా కార్యక్రమంలో ఏ వాక్సిన్ ను పరిగణనలోకి తీసుకోవాలంటే ప్రతి టీకా తయారిదారి కంపెనీ తప్పనిసరిగా స్థానికంగా పరీక్షలు జరపాలని భారతదేశం ఆదేశించింది.

మరిన్ని వార్తలు