నటిని ముక్కలుగా చేసి.. ఆపై బతికే ఉందని నమ్మించాడు

31 Mar, 2022 13:19 IST|Sakshi

ఆమె ఒక శృంగార తార. రెండు నెలల నుంచి బయటి ప్రపంచంతో సంబంధాలు లేకుండా.. సైలెంట్‌గా ఉండిపోయింది. ఈలోపు పోలీసులకు ఓ మహిళ మృతదేహం కేసు పెద్ద తలనొప్పిగా మారింది. చివరాఖరికి..  ముచ్చటపడి ఒంటి మీద వేయించుకున్న టాటూలే, ఆ శృంగార తార మిస్సింగ్‌ మిస్టరీ, హత్యను బయటపెట్టాయి. 

ఇటలీ బ్రెసియా ప్రావిన్స్‌లోని ‘బోర్నో’లో నటి కరోల్‌ మాల్టేసి(26) హత్యోదంతం సంచలనం సృష్టించింది. దాదాపు రెండు నెలల తర్వాత..  ఊరి శివారులో 15 చెత్త సంచుల్లో ఆమె మృతదేహాం ముక్కలుగా లభ్యమైంది.  ముఖం పూర్తిగా కాలిపోయి ఉంది. దీంతో ఆమె ఎవరనేది పోల్చుకోవడానికి పోలీసులకు కష్టంగా మారింది.

కరోల్‌ మాల్టేసి అలియాస్‌ ఛార్లోట్టె యాంగీ.. ఓన్లీఫ్యాన్స్‌ స్టార్‌.  ఆరేళ్ల ఓ బిడ్డకు తల్లి కూడా. అంతకు ముందు ఓ రెస్టారెంట్‌లో పని చేసేదామె. అయితే కరోనా వల్ల ఉద్యోగం పోవడంతో.. అడల్ట్‌ స్టార్‌ అవతారం ఎత్తింది . ఆపై కొన్ని అడల్ట్‌ సినిమాల్లో నటించింది కూడా. అయితే.. జనవరి నుంచి ఆమె అకౌంట్‌ వాడకంలో లేదు. ఏ కొత్త చిత్రానికి సైన్‌ చేయలేదు. ఈలోపు..

వారం కిందట.. బోర్నో శివారులో ప్లాస్టిక్‌ సంచుల్లో ముక్కలుగా ఉన్న గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే నమోదు అయిన మిస్సింగ్‌ కేసులతో ఆ బాడీ ఆనవాలు మ్యాచ్‌ కాలేదు. దీంతో పోలీసులకు విచారణ కష్టతరంగా మారింది. ఈ తరుణంలో బాడీపై ఉన్న టాటూల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం.. ఆ రాతలు ప్రత్యేకమైనవి కావడంతో ఆమె స్నేహితులు పోల్చుకోగలిగారు. చివరికి అవి ఇటలీ-డచ్‌ సంతతికి చెందిన కరోల్‌ మాల్టేసివే అని నిర్ధారించుకున్నారు. 

అద్దె కట్టడంతో అనుమానం 
జనవరి నుంచి కరోల్‌ తన సోషల్‌ మీడియా అకౌంట్‌లో యాక్టివ్‌గా లేదు. దీంతో ఆమె విదేశాలకు వెళ్లి ఉంటుందని ఆమె స్నేహితులు భావించారట. అందుకే ఆమె మిస్సింగ్‌ కేసు నమోదు కాలేదు. ఈ లోపు ఆమె క్రమం తప్పకుండా అద్దె చెల్లిస్తుండడంపై పోలీసులు దృష్టి పెట్టారు. ఆ పని చేస్తోంది.. కరోల్‌ పక్కింట్లో ఉండే 43 ఏళ్ల డేవిడ్‌ ఫోంటానా. బ్యాంక్‌ ఉద్యోగి అయిన డేవిడ్‌ ఫోంటానాను పోలీసులు విచారించగా..  హత్య తానే చేసినట్లు అంగీకరించాడు.  

ముక్కలు చేసి ఫ్రీజర్‌లో..
పరస్పర అంగీకారంతో.. శృంగారంలో పాల్గొనే సమయంలోనే పొరపాటున ఆమెను హత్య చేశానని నిందితుడు డేవిడ్‌ ఫొంటానా చెప్పాడు. హత్య అనంతరం పోలీసులకు దొరకకుండా ఉండేందుకు ఆమె బాడీని ముక్కలుగా చేసి సంచుల్లో దాచేసి.. ఫ్రీజర్‌లో భద్రపరిచాడట. అప్పటి నుంచి ఆమె ఇంటి అద్దెను చెల్లించడంతో పాటు బాధితురాలి తల్లికి, ఆమె బాయ్‌ఫ్రెండ్‌కు ఫోన్‌ ద్వారా సందేశాలు ఇస్తూ.. ఆమె బతికే ఉందని నమ్మించే ప్రయత్నం చేశాడు.

ఈ క్రమంలో ఆమె నుంచి బదులు రాకపోవడంతో అనుమానం వచ్చిన ఓ స్నేహితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆమె ఇంటికి ఎంక్వైరీకి వచ్చారు. ఈ పరిణామంతో భయపడ్డ నిందితుడు.. ఫ్రీజర్‌ నుంచి ఆ సంచుల్ని తీసేసి ఊరి చివర పడేసి వచ్చాడు. ఆపై ఒంటి మీద టాటూల ఆధారంగా మొత్తానికి ఈ కేసును చేధించారు పోలీసులు.

మరిన్ని వార్తలు