ఒళ్లంతా పచ్చబొట్లతో ఉద్యోగం కాస్తా ఊడింది

29 Sep, 2020 16:03 IST|Sakshi

పారిస్‌ :  పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయుడి వేషధారణ ఎంత సక్రమంగా ఉంటే పిల్లలు కూడా అలాగే ఉంటారు. టీచర్‌ ఎంత పద్దతిగా ఉంటే విద్యార్థులు కూడా అంత బాగుంటార‌ని ప్రతీ తల్లిదండ్రులు భావిస్తారు. కానీ ఇక్కడ ఒక టీచర్‌ మాత్రం ఒక‌టి, రెండు కాదు ఏకంగా శ‌రీర‌మంతా ప‌చ్చబొట్లు పొడిపించుకున్నాడు. చివ‌రికి కంట్లోని గుడ్డు పక్కన ఉన్న పొరను కూడా తొలిగించుకొని టాటూ వేయించుకున్నాడు.. అత‌ని అవ‌తారం చూసిన పిల్లల త‌ల్లిదండ్రులు స్కూల్‌ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీంతో స్కూల్‌ యాజమాన్యం అత‌న్ని ఉద్యోగం నుంచి తీసేశారు. (చదవండి : పార్లమెంట్‌లోని బార్లలో పొంగుతున్న బీర్లు)

వివరాలు.. సిల్వైన్ అనే వ్యక్తి ఫ్రాన్స్‌ దేశంలోని ప‌లైసేలోని డాక్టూర్ మోరే ఎలిమెంట‌రీ స్కూల్లో టీచర్‌గా ప‌నిచేస్తున్నాడు. త‌ల నుంచి కాలు వ‌ర‌కు టాటూలు వేయించుకున్నాడు. 35 ఏండ్ల సిల్వైన్‌ ఆరు సంవత్సారాల వ‌య‌సున్న పిల్లల నుంచి మొదలుపెట్టి పెద్దలకు బోధిస్తున్నాడు. దీంతో అత‌నిని ఫ్రెంచ్ కిండర్ గార్టెన్లో బోధించకుండా విధుల నుంచి తొలగించారు.

'త్వరలో నా ప్రొఫెష‌న్‌ను మ‌ళ్లీ కొన‌సాగిస్తా. పిల్లలకు, నాకు మధ్య మంచి అనుబంధం ఉంది. వారి త‌ల్లిదండ్రులు కూడా నాతో బాగానే ఉంటారు. కాకాపోతే నన్ను దూరం నుంచి చూసి త‌ప్పుగా అర్థం చేసుకున్నారంటూ' సిల్వైన్‌ చెప్పుకొచ్చాడు. కాగా సిల్వైన్‌కు 27 ఏండ్ల వ‌య‌సు నుంచే టాటూల మీద ఇష్టం ఏర్పడింది. ఈ 8 సంవత్సరాల్లో అత‌ని చెవులు, నాలుక‌తో స‌హా దాదాపు మొత్తం శ‌రీరాన్ని సిరాతో క‌ప్పేశాడు. (చదవండి : ఆర్మేనియా– అజర్‌బైజాన్‌ మధ్య ఘర్షణ) 

మరిన్ని వార్తలు