Viral Video: విద్యార్థుల ఫోన్‌లను తగలుబెట్టిన టీచర్లు!... మండిపడుతున్న నెటిజన్లు

24 Feb, 2022 18:06 IST|Sakshi

Students' Cellphones Seized Thrown Into Fire: విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టే నిమిత్తం టీచర్లు కచ్చితంగా కొన్ని కఠిన చర్యలు అమలు చేస్తుంటారు. అది వారి బావి భవిష్యత్తును దృష్టలో ఉంచుకుని కొన్ని విషయాల్లో కఠినంగా వ్యవహరిస్తారు. అచ్చం అలానే ఇండోనేషియాలోని టీచర్లు విద్యార్థుల పట్ల కఠినమైన వైఖరిని అవలంభించారు. అయితే ఈ టీచర్లు విద్యార్థులు మాట వినకపోవటం వల్ల వాళ్లు అంత పెద్ద నిర్ణయం తీసుకున్నారో ఏమో తెలియదు గానీ విద్యార్థులను మాత్రం కాస్త కఠినంగానే శిక్షించారు.

అసలు విషయంలోకెళ్తే...నిజానికి పాఠశాల్లో స్మార్ట్‌ ఫోన్‌లను కొన్ని గంటల సేపు నిషేధించడం లేదా స్టడీ అవర్స్‌ అయ్యేంతవరకు నిషేధిస్తారు. కానీ ఇండోనేషియాల బోర్డింగ్‌ స్కూల్లో స్మార్ట్‌ ఫోన్‌లు పూర్తిగా నిషేధించారో ఏమో తెలియదు గానీ విద్యార్థుల ఎంత చెప్పిన స్మార్ట్‌ ఫోన్‌లు తీసుకువస్తున్నారని టీచర్లు కోపంతో ఫోన్‌ల్నింటిని వారి వద్ద నుంచి తీసేసుకున్నారు. వాటిని వారి ముందే మంటల్లో వేసి కాల్చేశారు.

ప్లీజ్‌ మేడం వద్దు అంటూ విద్యార్థులు అరుస్తున్నప్పటికీ వినిపించుకోకుండా టీచర్లు స్మార్ట్‌ ఫోన్‌లు మంటల్లో వేసేశారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. దీంతో నెటిజన్లు బహుశా టీచర్లు పదేపదే చెప్పినా విద్యార్థులు వినిపించుకోకపోవడంతో అలా చేసి ఉంటారని కొందరు, అయినా ఒకరి ఆస్తిని నాశనం చేసే హక్కు ఎవరికి లేదంటూ మరికొంతమంది మండిపడుతున్నారు.

A post shared by Fakta Indo | Berita Indonesia (@fakta.indo)

(చదవండి: మంచు పర్వత అధిరోహణ.. దూసుకొచ్చిన హిమపాతం!)

మరిన్ని వార్తలు