నిధుల సేకరణ కోసం మూడేళ్లగా టెంట్‌లోనే నిద్రించి..రికార్డు సృష్టించాడు

31 Mar, 2023 12:24 IST|Sakshi

ఓ యువకుడు క్యాపంగ్‌ ద్వారా అత్యధిక డబ్బులు సేకరించిన వ్యక్తిగి రికార్డు సృష్టించాడు. ది బాయ్‌ ఇన్‌ ది టెన్త్‌గా పేరుగాంచి ఈ రికార్డు సాధించాడు. ఒక ఛారిటీ కోసం ఇంత పెద్ద మొత్తంలో నిధులు కూడ బెట్టిన తొలి వ్యక్తి ఆ టీనేజర్. వివరాల్లోకెళ్తే..యూకేకి చెందిన మాక్స్‌ వూసే అనే యువకుడు తమ పొరుగన ఉండే ఫ్యామిలీ స్నేహితుడిని క్యాన్సర్‌ వ్యాధి కారణంగా కోల్పోవడంతో..అలాంటి సమస్యను ఎదుర్కొనే వాళ్లకు సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగానే నార్త్‌ డెవాన్‌ ఛారిటీ కోసం మూడేళ్లుగా క్యాంపింగ్‌ నిర్వహించి అత్యధికంగా డబ్బును సేకరించాడు.

ఇలా అతను సుమారు రూ. 7.6 కోట్లను వసూలు చేశాడు. అందుకోసం పలుచోట్లకు టెంట్‌ తోసహా తిరిగేవాడు. అక్కడ క్యాంపింగ్‌ నిర్వహించి టెంట్‌లోనే నిద్రపోయేవాడు. అలా మూడేళ్లు అదే ధ్యాసలో గడిపాడు. దీంతో వూసే 'ది బాయ్‌ ఇన్‌ ది టెన్ట్‌'గా పేరుగాంచాడు. ఇలా వూసే తన ఫ్యామిలీ స్నేహితుడు రిక్‌ అబాట్‌ మరణించిన తర్వాత నుంచి అంటే.. వూసేకి 10 ఏళ్ల ప్రాయం నుంచి నిధుల సేకరణ ప్రారభించాడు. సరిగ్గా మార్చి  2020లో నిధుల సేకరించడం మొదలుపెట్టాడు. తన స్నేహితుడి రిక్‌కు వూసే కుటుంబం ఆర్థిక సాయం అందిచిన్పటికీ వైద్యులు అతన్ని రక్షించలేకపోయారు.

ఆస్పత్రి కూడా అతడు బతకాలని ఎంతగానో కోరింది గానీ సఫలం కాలేదు. ఆ ఘటన ఫ్యామిలీ స్నేహితుడిలాంటి వారి కోసం ఏదో చేయమన్నట్లు తన మనసుకు బలంగా అనిపించిందని చెబుతున్నాడు. ఐతే వూసే నిధుల సేకరణ మొదలు పెట్టే సమయంలోనే కరోనా, తుపానులు పెద్ద సవాళ్లుగా మారాయి. తీవ్రమైన గడ్డకట్టే మంచుకుని సైతం అధిగమించి ఎన్నో ‍ప్రయాసలకు ఓర్చి ఈ నిధులను సమకూర్చాడు.

ఒకనొక సమయంలో తుపాను కారణంగా వూసే టెంట్‌ కూడా కూలిపోయింది. అయినా లెక్క చేయక మొక్కవోని దీక్షతో నిధులు సేకరించాడు. ఈ ‍ప్రయాణంలో గొప్ప గొప్ప వ్యక్తులను కలుసుకున్నాను, ఎన్నో అద్భుతమైన అనుభవాలను పొందాను అని చెబుతున్నాడు వూసే. ఇక ఏప్రిల్‌ 2023 నాటికి తన నిదుల సేకరణను ఆపేసి తనకెంతో ఇష్టమైన రగ్బీపై దృష్టిపెట్టనున్నట్లు తెలిపాడు. ఇంత చిన్న వయసులో ఇంత  నిబద్ధత, నిస్వార్థపూరితమైన అతని గొప్ప మనసుని చూసి అందరూ ఫిదా అవుతున్నారు. చిన్నపిల్లలైనా వారు కూడా ఇలాంటి సేవ కార్యక్రమాలు చేయగలరు అని నిరూపించాడు వూసే.

(చదవండి: వెల్లువలా ఉత్తర కొరియా అరాచకాలు..వెలుగులోకి విస్తుపోయే దారుణాలు)

మరిన్ని వార్తలు