కలచివేస్తున్న శిథిల దృశ్యం.. కొత్త డ్రెస్సులో విద్యార్థిని.. అసలేం జరిగింది?

10 Jun, 2022 12:00 IST|Sakshi

కీవ్‌: ఉక్రెయిన్‌-రష్యా ఉద్రిక్తతలు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. నగరాలు, పట్టణాలను అధీనంలోకి తెచ్చుకునేందుకు మాస్కో సైన్యం ప్రణాళికలు రచిస్తుండగా ఉక్రెయిన్‌ ఆర్మీ తీవ్ర స్థాయిలో ప్రతిఘటిస్తోంది. ఈక్రమంలో కార్యాలయాలు, పాఠశాలలు, పార్కులు, నివాసాలు నేలమట్టమవుతున్నాయి. మరోవైపు రష్యా సైన్యం దాడుల్లో నిత్యం 100 మంది దాకా తమ సైనికులు మరణిస్తున్నారని ఉక్రెయిన్‌ రక్షణ శాఖ మంత్రి ఒలెక్సీ రెజ్నికోవ్‌ తెలిపారు. రక్తపాతం బాధాకరమని ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. తమ బిడ్డలను కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
చదవండి👉🏼 పాకిస్తాన్‌లో హిందూ జనాభా ఎంతో తెలుసా?

ఈక్రమంలో ఓ విద్యార్థిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఓ ఫొటో కలచివేస్తోంది. ‘అన్నీ బాగుంటే ఈ ఫొటోలో కనిపిస్తున్న అన్నా ఎపిసెవా ఈ ఏడాది తన హైస్కూల్‌ చదువును పూర్తి చేసేది. ఘనంగా జరిగే తన స్కూల్‌ వార్షిక సదస్సులో ఆమె, ఆమె స్నేహితులు పాల్గొని సందడి చేసేవారు. అందుకోసం వారంతా కొత్త బట్టలు కూడా కొని తెచ్చుకున్నారు. కానీ, పరిస్థితులు తల్లకిందులయ్యాయి. మాయదారి యుద్ధం కలలను కల్లలు చేసింది. దేశాన్ని, తమ పాఠశాలను సర్వనాశం చేసింది. శిథిలాలుగా మిగిలిపోయిన తన స్కూల్‌ వద్ద ఎపిసెవా కొత్త డ్రెస్సు ధరించి మౌన రోదన చేసేది కాదు!’ అని ఒలెక్సాండ్రా మాత్విచుక్‌ తన కజిన్‌ గురించి ఆవేదనభరితంగా ట్విటర్‌లో రాసుకొచ్చింది. ఎపిసెవా ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి👉🏼 ప్రవక్త కామెంట్లు: అజిత్‌ దోవల్‌ పేరుతో ‘గుణపాఠం ట్వీట్‌’.. కాసేపటికే డిలీట్‌

మరిన్ని వార్తలు