జీనియస్‌.. లెక్కలేనంత ఇష్టం!

18 Dec, 2021 04:11 IST|Sakshi

వెల్లడించిన అమెరికా నివేదిక

వాషింగ్టన్‌: పాకిస్తాన్‌ను కేంద్రంగా చేసుకున్న ఉగ్ర ముఠాలు భారత్‌ను లక్ష్యంగా చేసుకొని దాడులు కొనసాగిస్తున్నాయని అమెరికా పునరుద్ఘాటించింది. భారత్‌పై దాడులకు తెగబడుతున్న ఉగ్రసంస్థలపై తగు కఠిన చర్యలు తీసుకోకుండా పాక్‌ నిర్లక్ష్య వైఖరిని కనబరుస్తోందని తన తాజా నివేదికలో అమెరికా తీవ్రంగా విమర్శించింది. మసూద్‌ అజర్, సాజిద్‌ మీర్‌ లాంటి ఉగ్రవాద నేతలు స్వేచ్ఛగా పాక్‌లో సంచరిస్తున్నా, వీరిని పాక్‌ అదుపులోకి తీసుకోవడంలేదని అమెరికా పేర్కొంది.

ఉగ్రవాదానికి సంబంధించిన 2020–నివేదికను అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ గురువారం విడుదలచేశారు. అఫ్గానిస్తాన్‌ను లక్ష్యంగా చేసుకొని అఫ్గాన్‌ తాలిబన్లు, వాటి అనుబంధ హక్కానీ నెట్‌వర్క్‌ దాడులు చేస్తూనే ఉన్నాయని, మరోవైపు లష్కరే తొయిబా, జైషే మహమ్మద్‌తో పాటు అనుబంధ సంస్థలు పాకిస్తాన్‌ నుంచి కార్యకలాపాలు సాగిస్తూ భారత్‌పై దాడులకు పాల్పడుతున్నాయని నివేదిక వెల్లడించింది.

లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్‌ సయీద్‌కు పాక్‌లో కోర్టులు జైలు శిక్షను విధించాయని తెలిపింది. ఎఫ్‌ఏటీఏ గ్రేలిస్టు నుంచి తప్పించుకునేందుకు పాక్‌ కొన్ని చర్యలు చేపట్టిందని, కానీ అవసరమైన అన్ని చర్యలు తీసుకోలేదని పేర్కొంది. పాకిస్తాన్‌లోని కొన్ని మదర్సాలో తీవ్రవాద భావజాలాన్ని నూరిపోస్తున్నారని నివేదిక తెలిపింది.

ఐసిస్‌లో 66 మంది భారతీయ సంతతి!
అంతర్జాతీయ ఉగ్రసంస్థ ఐసిస్‌లో 66మంది భారతీయ సంతతికి చెందినవారున్నారని ఉగ్రవాదంపై అమెరికా నివేదిక శుక్రవారం వెల్లడించింది. అంతర్జాతీయ, స్థానిక ఉగ్ర మూకలను గుర్తించి నిర్మూలించడంలో చురుగ్గా వ్యవహరిస్తున్నారని ఎన్‌ఐఏలాంటి భారత ఉగ్రవ్యతిరేక దళాలను నివేదిక ప్రశంసించింది. ఎయిర్‌పోర్టుల్లో కార్గో పరీక్షకు రెండు తెరల ఎక్స్‌రేతెరలను వాడేందుకు భారత్‌ అంగీకరించిందని నివేదిక తెలిపింది. అలాగే వాయుమార్గంలో ప్రయాణించే వారి రక్షణకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించే ఐరాస ప్రతిపాదన అమలకు కూడా ఇండియా సుముఖంగా ఉందని యూఎస్‌ సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ అంటోనీ బ్లింకెన్‌ తెలిపారు.

పలు ఒప్పందాల ద్వారా ఉగ్రపోరులో భారత్‌తో బలమైన భాగస్వామ్యం పెంచుకుంటున్నామని వెల్లడించా రు. ఐసిస్‌కు సంబంధించిన 34 కేసులను ఎన్‌ఐఏ విచారించిందని, 160మందిని అరెస్టు చేసిందని, వీరిలో 10మంది ఆల్‌ఖైదా ఆపరేటర్లని నివేదిక తెలిపింది. ఉగ్రసమాచారం అందించాలన్న యూఎస్‌ అభ్యర్థనకు భారత్‌ సానుకూలంగా స్పందిస్తోందని బ్లింకెన్‌ తెలిపారు. టెర్రరిస్టుల్లో టెక్నాలజీ వాడకంపై భారతీయ అధికారులు ఆందోళనగా ఉన్నారన్నారు. పలు దేశాలతో భారత్‌ ఉగ్ర కట్టడికి కలిసి పనిచేస్తోందని నివేదిక వెల్లడించింది.

మరిన్ని వార్తలు