Tesla Farm House: టెస్లా తెచ్చిన మినీ ఇల్లు.. కారులో ‘ఫామ్‌’ హౌస్, ధరెంతో తెలుసా?

27 Nov, 2021 14:03 IST|Sakshi
క్యాంపింగ్‌ ప్లేస్‌లో...

టెస్లా ఆవిష్కరణ 

డబుల్‌ బెడ్, కిచెన్, షవర్, లివింగ్‌ ఏరియా 

క్యాంపింగ్‌కి పర్ఫెక్ట్‌ 

2022లో మార్కెట్‌లోకి 

‘సంచారమే ఎంత బాగున్నది...’ అంటూ ట్రావెలింగ్‌తో ప్రపంచాన్ని చూడాలనుకునేవాళ్లకు శుభవార్త. వెళ్లిన చోటల్లా డేరాలతో క్యాంపింగ్‌ అక్కర్లేదు. ఇప్పటిదాకా మనకు కారావాన్‌లే తెలుసు. దానికంటే చిన్నసైజులో తక్కువ ఖర్చుతో విలాసవంతమైన మినీ ఇల్లును కార్ల దిగ్గజం టెస్లా అందుబాటులోకి తెచ్చింది.  అది సైబర్‌ట్రక్‌కు అటాచ్‌ చేసుకుని తీసుకెళ్లగలిగే మినీహోమ్‌. ‘ఫామ్‌’గా పిలిచే దీని ఖరీదు 51 లక్షలు.  


రోడ్డుపై దూసుకెళ్తూ..

2019లో టెస్లా సీఈఓ ఎలన్‌మస్క్‌ సైబర్‌ ట్రక్‌ను ఆవిష్కరించారు. బుల్లెట్‌ప్రూఫ్‌ విండోస్‌ దీని ప్రత్యేకత. ఈ సంవత్సరం మేలో వీధుల్లోకి వచ్చిన ఈ కారును కొనేందుకు వందలాది మంది న్యూయార్క్‌లోని టెస్లా షోరూమ్‌ ముందు క్యూ కట్టారు. ఇప్పుడు ఈ ట్రక్‌కు అనుసంధానించగలిగే ‘ఫామ్‌’ను తయారు చేశారు. ఇది కాలిఫోర్నియా ఇంజనీర్స్, ఇండస్ట్రియల్‌ డిజైనర్ల ఆలోచన. 


డబుల్‌ బెడ్‌

విలాసవంతంగా... 
సోలార్‌ పవర్‌తో నడిచే 71 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ‘ఫామ్‌’ 454 కిలోల బరువు మాత్రమే ఉంటుందని టెస్లా చెబుతోంది. డబుల్‌బెడ్, కిచెన్, షవర్‌తోపాటు లివింగ్‌ ఏరియా కూడా ఉంది. స్టోరేజ్‌ అవకాశం ఉన్న ఈ బెడ్స్‌ ఫోల్డబుల్‌. అవసరం లేదనుకుంటే బెడ్‌ను పూర్తిగా తొలగించి సింగిల్‌బెడ్‌ను ఉపయోగించుకోవచ్చు. మొత్తం క్యాబిన్‌ నుంచి టాయిలెట్‌ ఓ పక్కకు ఉంటుంది.


టాయిలెట్, షవర్‌

అవసరం లేదనుకుంటే దాన్ని కుషన్‌ బెంచ్‌గా మార్చుకోవచ్చు. ఇళ్లలో వాడే ఫ్రిజ్‌ను ఉంచే వీలుంది. స్టవ్, కుక్‌వేర్‌కోసం ప్రత్యేకమైన స్థలం ఉంది. క్యాంపింగ్‌ దగ్గర కిచెన్‌ను బయటికి ఓపెన్‌ చేసుకోవచ్చు. పైకప్పుతోపాటు కూర్చుని వంట చేసుకునే అవకాశంఉంది. ‘ఫామ్‌’పైన ఏర్పాటు చేసిన సోలార్‌ ప్యానల్స్‌ నుంచి ఫామ్‌కు అవసరమైన 400వాట్స్‌ విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది. 


కిచెన్‌

ఇతర ట్రక్‌లకూ అనుసంధానం.. 
టెస్లా సైబర్‌ట్రక్‌తో పాటు... ఫోర్డ్‌ ఎఫ్‌–150, షెవర్లెట్‌ సిల్వరాడో వంటి ట్రక్‌లకు కూడా దీనిని  చేసుకోవచ్చు. 2022లో మార్కెట్‌లోకి రానుంది. ఆర్డర్‌ చేయండి... మీ ఇంటికే తెచ్చిపెడతామని టెస్లా చెబుతోంది. 
– సాక్షి, సెంట్రల్‌డెస్క్‌

మరిన్ని వార్తలు